రేపు హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) 20వ వార్షికోత్సవం జరగనుంది. హైదరాబాద్ తో పాటు మొహాలీ క్యాంపస్ లకు చెందిన పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం స్నాతకోత్సవంలో ప్రధాని పాల్గొంటున్నారు. అంతర్జాతీయంగా మేనేజ్ మెంట్ శిక్షణ అందించే అత్యున్నత స్థాయి బిజినెస్ స్కూల్. దీంతో హైదరాబాద్‌లో భద్రత కట్టుదిట్టం చేశారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐ.ఎస్.బి) హైదరాబాదులోని అంతర్జాతీయ బిజినెస్ కళాశాలగా పేరు పొందింది. ఇక్కడ చదువుకున్న విద్యార్థినీ, విద్యార్ధులకు అంతర్జాతీయ సంస్థల్లో…
ప్రధాని మోడీ రేపు హైదాబాద్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఇండియన్ స్కూల్ ఆప్ బిజినెస్ (ఐఎస్‌బీ) 20 సంవత్సరాల స్నాతకోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు. అయితే ఇప్పటికే.. తెలంగాణ బీజేపీ నేతలు ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. పోలీసులు కూడా గచ్చిబౌలి ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అంతేకాకుండా భద్రత కారణాల దృష్ట్యా ఎస్పీజీ ఆధీనంలోకి ఐఎస్‌బీ వెళ్లిపోయింది. అయితే తాజాగా ప్రధాని మోడీకి పర్యటనకు సంబంధించిన…
ప్రధాని మోడీ ఈ నెల 26న హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆప్ బిజినెస్ (ఐఎస్‌బీ) 20వ వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో నిర్వహించనున్న స్నాతకోత్సవ వేడుకల్లో మోడీ పాల్గొననున్నారు. అయితే ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు 26 తేదీ మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు అమలులో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అయితే..…
ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా తెలంగాణ బీజేపీలో ఆసక్తికర చర్చ జరిగిందా? ప్రధానిని ఎవరు రిసీవ్ చేసుకోవాలి.. ఇంకెవరు వీడ్కోలు చెప్పాలన్నదానిపై తర్జనభర్జన పడ్డారా? చివరిక్షణం వరకు జాబితాలో మార్పులు తప్పలేదా? ఈ విషయంలో అసంతృప్తి ఉన్నదెవరికి? సంతోషం కలిగిందెవరికి? మోడీ టూర్‌లో చివరిక్షణం వరకు బీజేపీ ప్రొటోకాల్ జాబితాలో మార్పులుప్రధాని నరేంద్ర మోడీ పేరు చెప్పగానే బీజేపీ నాయకులు.. కార్యకర్తల్లో చాలా ఫీలింగ్స్ కలుగుతాయి. ఇక ఆయన్ని స్వయంగా కలిసే అవకాశం వస్తే.. బీజేపీ బ్యాచ్‌కు…
ప్రధాని మోడీ పర్యటనకు దూరంగా ఉన్నారు సీఎం కేసీఆర్. జ్వరం కారణంగా హాజరుకాలేదని పార్టీ, ప్రభుత్వ వర్గాలు తెలిపినా దీని వెనుక కారణాలు వున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గత కొంతకాలంగా ప్రధాని మోదీని కలిసేందుకు ప్రయత్నించి విఫలమవుతున్న సీఎం కేసీఆర్.. ఈ పర్యటన సందర్బంగా మోదీతో ఈ రకంగా వ్యవహరిస్తారించారని అంటున్నారు. మోడీ పేరు చెబితే కేసీఆర్ కు జ్వరం వచ్చిందని సెటైర్లు వేశారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. ప్రధానికి స్వాగతం పలికేందుకు సీఎం…
హైదరాబాద్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ బిజీబిజీగా గడిపారు. ముచ్చింతల్ లోని శ్రీరామానుజ సమతా మూర్తి విగ్రహావిష్కరణలో పాల్గొని సందడి చేశారు. అంతకముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ భుజం తట్టి పలకరించారు. ‘క్యా బండీ.. కైసే హై’ అంటూ కుశల ప్రశ్నలు వేశారు. ఆ తర్వాత జితేందర్‌రెడ్డి, కిషన్ రెడ్డి, నల్లు ఇంద్రసేనారెడ్డిలను కూడా పలకరించారు. మోడీని ఆహ్వానించేందుకు వచ్చారు కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ జి.కిషన్ రెడ్డి. పర్యటన ముగించుకుని తిరిగి…
హైదరాబాద్ ముచ్చింతల్ లో సమతా స్ఫూర్తి విగ్రహం కనుల పండువగా ఆవిష్కారం అయింది. సమతామూర్తి విగ్రహావిష్కరణకు వచ్చిన ప్రధాని మోదీ ఆహార్యం చూపరుల్ని విశేషంగా ఆకర్షించింది. యాగంలో పాల్గొనేందుకు వీలుగా వస్త్రధారణతో.. విష్ణునామాలు పెట్టుకుని విచ్చేశారు. బంగారు వర్ణపు పంచె ధరించి విష్వక్సేనేష్టి యాగానికి హాజరయ్యారు. ఉజ్జీవన సోపాన వేదిక నుంచి లేజర్ షో వీక్షించే వేదిక వరకు నడుచుకుంటూ వచ్చారు. సభ ముగిశాక ఉజ్జీవన సోపానంపై నుంచి 108 మెట్లు దిగి కిందికి వచ్చారు. భారతదేశ…