Pawan Kalyan : ఓజీ 2 ఈజ్ ఆన్.. పవన్ ఫ్యాన్ కి పండుగ లాంటి న్యూస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా పవర్ స్టార్, డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇవ్వబోతున్నారంటూ రకరకాల వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిజల్ట్ తర్వాత ఆయన యాక్టింగ్ కు ఫుల్ స్టాప్ పెట్టే ఆలోచనలో ఉన్నారని, రాజకీయాలపైనే పూర్తి ఫోకస్ పెట్టబోతున్నారనే ప్రచారం మెగా అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. అయితే, ఈ రూమర్లన్నింటికీ చెక్ పెడుతూ ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ అఫీషియల్ అకౌంట్ నుంచి ఒక సాలిడ్ ట్వీట్ వచ్చింది.
పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరం కాబోతున్నారనే వార్తలకు తమ ట్వీట్ ద్వారా గట్టి కౌంటర్ ఇచ్చింది క్రియేటివ్ వర్క్స్ టీమ్. “మాటిచ్చినట్టుగానే ఆయన (పవన్ కళ్యాణ్) సినిమా చేస్తారు. ఆ సమయం ఎప్పుడనేది ఆయనే స్వయంగా ప్రకటిస్తారు. డైరెక్టర్ సుజీత్ విదేశాల నుంచి తిరిగి రాగానే.. మేము ‘ఓజీ 2’ #OG2 ప్రాజెక్ట్ గురించి చర్చలు జరుపుతాము” అంటూ అధికారికంగా క్లారిటీ ఇచ్చారు. ‘ఓజీ’ మొదటి భాగం షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు సిద్ధమవుతున్న తరుణంలోనే, డైరెక్టర్ సుజీత్ నానితో ‘బ్లడీ రోమియో’ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్యారడైజ్ లేట్ కావడంతో ఆ సినిమా లేటు అయ్యే అవకాశం ఉందని అనుకున్నారు. అయితే ప్రస్తుతం సుజీత్ విదేశీ పర్యటనలో ఉన్నారని, ఆయన ఇండియాకు తిరిగి రాగానే పవన్ కళ్యాణ్‌తో కూర్చుని ‘ఓజీ 2’ కథా చర్చలు, షూటింగ్ షెడ్యూల్స్ పై ఒక స్పష్టతకు రానున్నారని ఈ ట్వీట్ ద్వారా స్పష్టమైంది. ఈ అధికారిక ప్రకటనతో పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరం కావడం లేదని, కాకపోతే పొలిటికల్ షెడ్యూల్స్, తన హెల్త్ కండిషన్‌ను బట్టి కాస్త సమయం తీసుకుని సరైన టైమింగ్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తారని తేలిపోయింది. దీంతో గత కొద్ది గంటలుగా టెన్షన్లో ఉన్న మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు.
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
తాజావార్తలు
-
SJ Suryah Bodhi: ‘జైలర్ 2’ నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
-
Etela Rajender : ధరణి పేరుతో పేద రైతులకు తీవ్ర అన్యాయం
-
CJP: ‘‘ రాజులు కాదు’’.. ABVP విజయంపై కాక్రోచ్ పార్టీ స్పందన.
-
Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
-
Praful Hinge: SRH పేసర్ ప్రఫుల్ హింగేకు అరుదైన అవకాశం.. భారత్ ‘ఏ’ జట్టులోకి ఎంట్రీ..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!