సార్వత్రిక ఎన్నికలకు ఇంకా సమయంలో ఉన్నా ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడే ఎన్నికల పొత్తులపై చర్చలు సాగుతున్నాయి.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడడమే తన ధ్యేయమని ఒకరు అంటే.. అంతే ఏకమై.. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని మరికొందరు అంటున్నారు.. కానీ, తమకు జనసేన పార్టీతోనే పొత్తు.. మరో పార్టీ అవసరం లేదంటున్నారు భారతీయ జనతా పార్టీ నేతలు.. విశాఖలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ పొత్తుల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు.. జనసేనతో తప్ప…
ఉత్తరాంధ్ర విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ జలం కోసం-ఉత్తరాంధ్ర జన పోరు యాత్ర సాగిస్తోంది. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ ప్రభుత్వ తీరుని తప్పుబట్టారు. జలం కోసం – ఉత్తరాంధ్ర జన పోరు యాత్ర ఈనెల 7వ తేదీ 9గంటలకు మొదలవుతుందన్నారు. త్రాగు , సాగునీటి ప్రాజెక్ట్ ల సాధన కోసం మూడు రోజులు యాత్ర సాగిస్తామన్నారు. ఇప్పటికే రెండు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించామని, ముఖ్య అతిధిగా సునీల్…
అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ సినీ గేయరచయిత, మానవతావాది సిరివెన్నెల సీతారామశాస్త్రి లేని లోటు తీర్చలేనిదన్నారు బీజేపీ నేత, ఎమ్మెల్సీ మాధవ్. ఆయనకు తగిన గుర్తింపు లభించలేదని, మరిన్ని అవార్డులు ఆయనకు లభించాలన్నారు మాధవ్. ఆయనతో తమ కుటుంబానికి వున్న అనుబంధాన్ని మాధవ్ గుర్తుచేసుకున్నారు. తన తండ్రికి ఆయన ఎంతో సన్నిహితులు అన్నారు. సినీ ప్రస్థానానికి రాకముందే సమాజాన్ని మరింతగా చైతన్య పరిచారన్నారు. ప్రజల్ని అలరించడమే కాదు సామాజిక బాధ్యత ఆయన రచనల్లో వుండేదన్నారు. ఆయన సామాజికంగా, రాజకీయంగా,…
విశాఖ ఉక్కు.. ఆంధ్రల హక్కు అంటూ ఓ వైపు పోరాటం జరుగుతున్నా.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వడివడిగా ముందుకు అడుగులు వేస్తోంది ప్రభుత్వం.. ఈ వ్యవహారంలో అన్ని పార్టీలు కేంద్రంపై విమర్శలు పెంచాయి.. పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధం అవుతున్నాయి. అయితే, ఈ వ్యవహారంపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మాట్లాడే హక్కు ఏ పార్టీకిలేదన్నారు.. కేవలం రాజకీయ పార్టీలు తమ స్వలాభం కోసం స్టీల్ ప్లాంట్ పై ప్రేమ చూపిస్తున్నాయని మండిపడ్డారు.…