తెలంగాణలో భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ ప్రకటన చేయడంతో నిరుద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈ అంశంపై స్పందించారు. ఉద్యోగాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం తడబడిన సందర్భమే లేదని.. ఇప్పటికే 1.56 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చామని ఆమె గుర్తు చేశారు. మరోవైపు ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాల కల్పనకు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందని ఆమె స్పష్టం చేశారు. అటు కేంద్రంలో ప్రధాని మోదీ రెండు కోట్ల…
చేతులు కాలాకా ఆకులు పట్టుకున్నారు అధికారపార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు. అనుచరుడు ఏకు మేకై వ్యవహారాలు నడపటంతో తలపట్టుకున్నారట. తాజా ఘటనలో అధిష్ఠానానికి MLAలు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. దీంతో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ పెరుగుతోందట. ఎమ్మెల్యేలకు మింగుడు పడని మేయర్ భర్త తీరునిజామాబాద్ నగరంలోని సాయినగర్‌లో 300 గజాల స్థలం టీఆర్‌ఎస్‌లో చిచ్చు రాజేసింది. విలువైన ఈ స్థలం కోసం అధికారపార్టీ నేతలు వీధిపోరాటానికి దిగడం.. పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడం.. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా…
తెలంగాణలో ఆడపిల్లలు, మైనర్ బాలికలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు ఆకుల విజయ. నిర్మల్ మునిసిపల్ వైస్ ఛైర్మెన్ నిర్మల్ నుండి మైనర్ బాలికను హైదరాబాద్ కి తీసుకువచ్చి అత్యాచారం చేశారు. తవరకు అతడిని అరెస్ట్ చేయలేదు. టి ఆర్ ఎస్ నాయకుడు కాబట్టే ఇంతవరకు పోలీసులు అరెస్ట్ చేయలేదు. అలాగే, సిరిసిల్లలో ఒక అమ్మాయి మిస్ అయ్యి నెల రోజులు అయింది. కేటీఆర్ నియోజకవర్గంలో అమ్మాయి…
తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ కి రేవంత్ కౌంటర్ ఇచ్చారు. “మొసలి కన్నీరు” కార్చడం మీ నాయకత్వ ప్రావీణ్యం.ప్రధాని మోదీ తెలంగాణ తల్లిని, మన అమరవీరుల త్యాగాలను అవమానించినప్పుడు మీ నాయకుడు ఎందుకు మౌనంగా ఉన్నారని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. కేసీఆర్ ను ఎప్పుడూ నమ్మవద్దు అంటూ ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన అమరులను, తెలంగాణ తల్లిని ప్రధాని నరేంద్రమోడీ…
తెలంగాణ విషయంలో మోడీ వ్యాఖ్యలు రాజకీయాలను వేడెక్కించాయనే చెప్పాలి. తెలంగాణ విషయంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటలయుద్ధం కొనసాగుతూనే వుంది. తాజాగా కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జి, మానిక్కం ఠాకూర్ వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కౌంటర్ ఇచ్చారు. నాటిఉద్యమ నాయకులు , సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజా పోరాటం ద్వారా తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల కాదు. అహింసా మార్గంలో కేసీఆర్ చేపట్టిన పోరాటంలో ప్రజలంతా ఆయనతో కలిసి రావడం, ఆనాడు ప్రభుత్వంలో…
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవతి.. సింగరేణి సంస్థ మూసివేతకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శించిన ఆమె.. బొగ్గు గని కార్మికుల చెమట చుక్కతో దక్షిణ భారతానికి వెలుగులు పంచుతోన్న సంస్థ సింగరేణి అని పేర్కొన్నారు.. సింగరేణిలో రాష్ట్రానికి 51 శాతం, కేంద్రానికి 49 శాతం వాటా ఉన్నప్పటికీ బీజేపీ తన అధికారాలను తప్పుడు రీతిలో ఉపయోగిస్తోందని విమర్శించారు.. బీజేపీ వైఖరి సమాఖ్య స్పూర్తికి…
అసోం సీఎంకి ఎమ్మెల్సీ కవిత స్ట్రాంగ్ కౌంటర్ తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బీజేపీకి చెందిన జాతీయ నేతలు తెలంగాణకు వచ్చి కేసీఆర్ పాలనపై మండిపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మ చేసిన కామెంట్స్ పై ట్విట్టర్‌లో స్పందించారు టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తెలంగాణ గొప్ప సంస్కృతి సంప్రదాయాలను తుడిచిపెట్టడానికి బీజేపీ ఇంతగా ఎందుకు ప్రయత్నిస్తుందో అర్థం అవడం లేదన్నారు. 2018 ఎన్నికల్లో ఇలాగే…
తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ నడుస్తోంది. ఇరు పార్టీల నేతల మధ్య ఘాటైన వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కేటీఆర్ కుటుంబంపై వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత తీన్మార్ మల్లన్నపై టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. తాజాగా బోధన్ ఎమ్మెల్యే షకీల్ చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. తీన్మార్ మల్లన్న పై బోధన్ ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబంపై మరోసారి మాట్లాడితే ముక్కలుగా నరికేస్తానన్నారు. మళ్ళీ ఇలాంటివి రిపీట్ అయితే.. మూడు వందల ముక్కలుగా నరికేస్తాం. ఎక్కువ మాట్లాడితే…
తెలంగాణలో సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మంగళవారం నిజమాబాద్ జిల్లాలోని భీంగల్ పట్టణంలో టీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న కవిత మాట్లాడుతూ.. భీంగల్ పట్టణానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో అమలు చేసుకునేందుకు కృషి చేస్తామని ఆమె అన్నారు. అభివృద్ధి విషయంలో దేశంలో మంచి పేరు తెలంగాణ తెచ్చుకుందని, ఇవన్నీ పక్కన పెట్టి కొందరు బీజేపీ నాయకులు రాజకీయం మాట్లాడుతున్నారని…