కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవతి.. సింగరేణి సంస్థ మూసివేతకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శించిన ఆమె.. బొగ్గు గని కార్మికుల చెమట చుక్కతో దక్షిణ భారతానికి వెలుగులు పంచుతోన్న సంస్థ సింగరేణి అని పేర్కొన్నారు.. సింగరేణిలో రాష్ట్రానికి 51 శాతం, కేంద్రానికి 49 శాతం వాటా ఉన్నప్పటికీ బీజేపీ తన అధికారాలను తప్పుడు రీతిలో ఉపయోగిస్తోందని విమర్శించారు.. బీజేపీ వైఖరి సమాఖ్య స్పూర్తికి…
అసోం సీఎంకి ఎమ్మెల్సీ కవిత స్ట్రాంగ్ కౌంటర్ తెలంగాణలో టీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బీజేపీకి చెందిన జాతీయ నేతలు తెలంగాణకు వచ్చి కేసీఆర్ పాలనపై మండిపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మ చేసిన కామెంట్స్ పై ట్విట్టర్లో స్పందించారు టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తెలంగాణ గొప్ప సంస్కృతి సంప్రదాయాలను తుడిచిపెట్టడానికి బీజేపీ ఇంతగా ఎందుకు ప్రయత్నిస్తుందో అర్థం అవడం లేదన్నారు. 2018 ఎన్నికల్లో ఇలాగే…
తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ నడుస్తోంది. ఇరు పార్టీల నేతల మధ్య ఘాటైన వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కేటీఆర్ కుటుంబంపై వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత తీన్మార్ మల్లన్నపై టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. తాజాగా బోధన్ ఎమ్మెల్యే షకీల్ చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. తీన్మార్ మల్లన్న పై బోధన్ ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబంపై మరోసారి మాట్లాడితే ముక్కలుగా నరికేస్తానన్నారు. మళ్ళీ ఇలాంటివి రిపీట్ అయితే.. మూడు వందల ముక్కలుగా నరికేస్తాం. ఎక్కువ మాట్లాడితే…
తెలంగాణలో సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మంగళవారం నిజమాబాద్ జిల్లాలోని భీంగల్ పట్టణంలో టీఆర్‌ఎస్ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న కవిత మాట్లాడుతూ.. భీంగల్ పట్టణానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో అమలు చేసుకునేందుకు కృషి చేస్తామని ఆమె అన్నారు. అభివృద్ధి విషయంలో దేశంలో మంచి పేరు తెలంగాణ తెచ్చుకుందని, ఇవన్నీ పక్కన పెట్టి కొందరు బీజేపీ నాయకులు రాజకీయం మాట్లాడుతున్నారని…
నిజామాబాద్ జిల్లాలోని భీంగల్‌లో టీఆర్‌ఎస్ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో పాల్గొన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధిపనులు వేగంగా జరుగుతున్నాయని, ఎమ్మెల్సీ కవిత ఆలోచన కృషి వల్లనే భీంగల్ మునిసిపాలిటీగా మారి అభివృద్ధిపథంలో నడుస్తోందని ఆయన అన్నారు. గతంలో కనీవినీ ఎరుగని రీతిలో భీంగల్ పట్టణం ప్రగతి సాధిస్తోందని, కేసీఆర్‌ను కడుపులో పెట్టుకుంటున్న గ్రామాలను అభివృద్ధి చేసే భాద్యత మాదే అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా తెలంగాణలో అమలయ్యే సంక్షేమ పథకాలు…
తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు బహిరంగ లేఖ రాశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరుసగా గెలిచినందుకు సదరు లేఖలో కవితకు రామోజీరావు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయపరంపర కొనసాగించి ప్రాబల్యం చాటుకున్న మీరు శాసనమండలిలో ప్రజావాణిని మరింత గట్టిగా వినిపించి నాయకురాలిగా ఇనుమడించిన కీర్తిని గడిస్తారని విశ్వసిస్తున్నాను. ప్రజాసేవలో మరెన్నో విజయాలు సాధించి అందరి మన్ననలు అందుకుంటారని భావిస్తున్నా’…
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ఏర్పడింది. తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి వుంది. మొత్తం 102 నామినేషన్లు దాఖలయ్యాయి. చెదురుమదురు ఘటనలు మినహా నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఇక పరిశీలన, ఉపసంహరణ మిగిలింది. స్వతంత్ర అభ్యర్థి నామినేషన్లను టీఆర్‌ఎస్ మద్దతుదారులు చించివేయడంతో రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. నామినేషన్ల గడువు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు ముగిసింది. అధికార టీఆర్‌ఎస్ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ…
టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్సీ కవిత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం నాడు ఆమె ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈరోజు నామినేషన్ దాఖలుకు ఆఖరి రోజు కావడంతో మంగళవారం మధ్యాహ్నం 1:45 గంటలకు ముహూర్తం చూసుకుని కవిత తన నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి సమర్పించారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌లతో కలిసి కవిత నామినేషన్ దాఖలు చేశారు. Read…
కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలంటూ టీఆర్‌ఎస్ అధినేత సహా టీఆర్‌ఎస్ శ్రేణులు ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు లతో పాటు భారీ ఎత్తున్న టీఆర్‌ఎస్ శ్రేణులు, రైతులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. అయితే ఈ మహా ధర్నా అనంతరం టీఆర్‌ఎస్ పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మహాధర్నా ముగిశాక రాజ్‌భవన్‌కు పాదయాత్రగా వెళ్లనున్నట్లు సమాచారం. సీఎం కేసీఆర్‌తో పాటు ప్రజా ప్రతినిధులంతా రాజ్‌భవన్‌కు పాదయాత్రగా వెళ్లే అవకాశం ఉంది. ఈ పాదయాత్ర సచివాలయం…