Kalvakuntla Kavitha: ‘నాన్నా’ జాగ్రత్త.. మీ వెనక భారీ కుట్ర జరుగుతోంది!
- మన ముగ్గురం కలిసి ఉండకూడదని కుట్రలు
- బీఆర్ఎస్‌ను హస్తగతం చేసుకునే కుట్ర జరుగుతోంది
- నాన్నా (కేసీఆర్) జాగ్రత్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘నాన్నా.. మీ చుట్టూ ఏం జరుగుతుందో ఓసారి చూసుకోండి’ అని బీఆర్ఎస్ అధినేత, తన తండ్రి కేసీఆర్‌ను కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకునే కుట్ర జరుగుతోందని, మీకు ప్రమాదం పొంచి ఉందని సూచించారు. తమ కుటుంబం విచ్ఛిన్నమైతేనే కొందరికి అధికారం వస్తుందని.. ఇందులో భాగంగానే మొదటగా తనను బయటకు పంపించారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీలో ఉండి కేవలం డబ్బు సంపాదించుకోవాలనే ఆలోచన ఉన్నవాళ్లు, వ్యక్తిగత లబ్ధి పొందాలనుకునే వాళ్లు.. మన ముగ్గురం (కేసీఆర్, కేటీఆర్, కవిత) కలిసి ఉండకూడదని కుట్రలు చేశారని కవిత చెప్పుకొచ్చారు.
హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ… ‘నాన్న, అన్న, నేను కలిసి ఉండటం బీఆర్ఎస్ పార్టీలో చాలా మందికి ఇష్టం లేదు. మా కుటుంబం విచ్ఛిన్నమయితే కొందరికి అధికారం వస్తుంది. ఆ కుట్రలో భాగంగా ముందుగా నన్ను బయటకు పంపించారు. నాన్నా మీ చుట్టూ ఏం జరుగుతుందో చూసుకోండి. రానున్న రోజుల్లో మీకు, అన్నకు ప్రమాదం పొంచి ఉంది. బీఆర్ఎస్‌ను హస్తగతం చేసుకునే కుట్ర జరుగుతోంది. డబ్బు సంపాదించుకోవాలనే ఆలోచన ఉన్నవాళ్లు, వ్యక్తిగత లబ్ధి పొందాలనుకునే వాళ్లు ఇదంతా చేస్తున్నారు’ అని చెప్పారు.
Also Read
- Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
- South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
- Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
- Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో విచిత్రం.. బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు, తన ఓటు కూడా పడలేదు!
Also Read: Kalvakuntla Kavitha: నాన్న నిర్ణయాన్ని శిరసావహిస్తుస్తా?.. ఏ పార్టీలో చేరను!
మీడియా సమావేశం అనంతరం కవిత చిట్ చాట్లో పాల్గొన్నారు. ‘మా కుటుంబంలో నలుగురికి ఫోన్ ట్యాపింగ్ నోటీసులు వచ్చాయి. కేటీఆర్‌కు సంబంధించిన వారి ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు. హరీశ్ రావు, సంతోష్ రావు, శ్రవణ్ లే ఫోన్ ట్యాపింగ్ చేయించారు. కేసీఆర్ ఫోటోతోనే నేను కార్యక్రమాలు చేపడతాను. నేను కేసీఆర్‌కు రాసిన లేఖను లీక్ చేసింది సంతోష్ రావు’ అని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ పదవికి తాను రాజీనామా చేసినట్లు కవిత అధికారికంగా ప్రకటించారు. బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం కవితను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
-
South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
-
Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!