Kalvakuntla Kavitha on Future Plans: తన తండ్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని తాను శిరసావహిస్తా? అని కల్వకుంట్ల కవిత తెలిపారు. తనను ఏ రోజు బీఆర్ఎస్ పార్టీ వివరణ కోరలేదని చెప్పారు. తాను ఏ పార్టీలో చేరను అని, ఏ పార్టీతోనూ తనకు అవసరం లేదని స్పష్టం చేశారు. కవితను మాజీ సీఎం కేసీఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈరోజు హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి.. ఎమ్మెల్సీ పదవికి, బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలిపారు.
కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడుతూ… ‘నేను ఏ పార్టీలో చేరను. ఏ పార్టీతోనూ నాకు అవసరం లేదు. జాగృతి కార్యకర్తలు, మేధావులతో చర్చించాకే భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. ప్రస్తుతానికి ఎమ్మెల్సీ పదవికి, బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశా. నాన్న (కేసీఆర్) ఇప్పుడు కూడా కొంత ఒత్తిడిలో ఉన్నారు. నాన్న తీసుకున్న నిర్ణయాన్ని శిరసావహిస్తా?. నన్ను ఏ రోజు పార్టీ వివరణ కోరలేదు’ అని చెప్పారు.
Also Read: MLC Kavitha Resignation: ఎమ్మెల్సీ పదవికి కల్వకంట్ల కవిత రాజీనామా!
హైదరాబాద్‌లో కల్వకుంట్ల కవిత ప్రెస్‌మీట్ జరుగుతుండగా.. ఎర్రవెల్లి ఫాంహౌస్ నుంచి గులాబీ బాస్ కేసీఆర్ బయటికి వచ్చారు. వాహనంలో ఫాంహౌస్ చుట్టూ తిరిగారు. ఎర్రవెల్లి ఫాంహౌస్‌ను కేసీఆర్ పరిశీలించారు. ప్రెస్‌మీట్లో కవిత ఏం మాట్లాడుతుందో తెలుసుకోకుండా.. ఫాంహౌస్‌ను పరిశీలించడం ఇక్కడ విశేషం. ఫాంహౌస్ చుట్టూ కేసీఆర్ వాహనం చక్కర్లు కొట్టిన వీడియో ఒకటి బయటికోచ్చింది.