ప్రస్తుతం తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల హిట్ నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే కరీంనగర్ జిల్లా స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటా పోటీగా నామినేషన్లు వేస్తున్నారు. అక్కడ ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఇప్పటికే 14 మంది అభ్యర్థుల తరపున 22 నామినేషన్లు దాఖలు చేసారు. ఇప్పటివరకు 13 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేయుటకు ఆసక్తి చూపించారు. అయితే నేడు తెరాస తరపున ఎల్ రమణ, బానుప్రసాద్ నామినేషన్ వేయనున్నారు. ఈరోజు నామినేషన్ ప్రక్రియ చివరి…
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా బరిలో ఉన్న టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి అధికారికంగా ప్రకటన చేశారు. కాసేపటి క్రితమే… అసెంబ్లీకి వచ్చిన… ఆరుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధులు…. ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి నుంచి సర్టిఫికెట్ తీసుకున్నారు. కడియం శ్రీహరి, గుత్తా, బండ ప్రకాష్, రవీందర్, వెంకట్రామిరెడ్డి, కౌశిక్ రెడ్డి సర్టిఫికెట్ తీసుకున్న వారిలో ఉన్నారు. ఇక ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ…. ఆరు ఎమ్మెల్సీలూ ఏకగ్రీవమయ్యాయని.. మాకు అవకాశం…
తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధినేత ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అటు ప్రజల్లో ఇటు పార్టీలో… అసంతృప్తి రాకుండా ఉండేందుకు ఇప్పటినుంచే… కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు సీఎం కేసీఆర్. అయితే రేపు ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఉన్న నేపథ్యంలో నిన్న రాత్రి ప్రగతి భవన్ లో మంత్రులతో కీలక సమావేశం నిర్వహించారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా 12 మంది అభ్యర్థులను ఫైనల్ చేశారు సీఎం కేసీఆర్. అయితే ఈ…
తెలంగాణలో స్థానిక సంస్థల కోటాల 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రులతో సీఎం కేసీఆర్ కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈ భేటీలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన పై చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం ప్రారంభం కానుంది. 12 మందిలో కొందరు అభ్యర్థులను మార్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ నెల 23 నామినేషన్ కు ఆఖరు తేదీగా…
MLC పదవి పేరు చెబితే ఆ జిల్లాలో ఎమ్మెల్యేలు ఉలిక్కి పడుతున్నారా? తమ నియోజకవర్గాల్లో ఎవరికీ ఆ పదవి ఇవ్వొద్దని ఓ రేంజ్‌లో మంతనాలు సాగిస్తున్నారా? ఎమ్మెల్సీ పదవంటే ఎందుకు హడలిపోతున్నారు? ఏంటా జిల్లా? తమ నియోజకవర్గానికి ఎమ్మెల్సీ పదవి రాకుండా ఎమ్మెల్యేల ఎత్తుగడ..! ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు పది. అన్నిచోట్లా ప్రస్తుతం ఒక్కటే చర్చ. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరగబోయే ఎన్నిక గురించే హాట్ హాట్‌గా చర్చలు నడుస్తున్నాయి. స్థానిక…
తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం లక్ష్యంగా కొత్త పార్టీని ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల.. వివిధ సమస్యలపై పోరాటం చేస్తూ వస్తున్నారు.. పాదయాత్ర, దీక్షలు, ధర్నాలు.. ఇలా వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక, నిరుద్యోగ సమస్యను పోరాట ఆయుధంగా తీసుకున్న వైఎస్ షర్మిల.. ప్రతీ మంగళవారం ఒక ప్రాంతాన్ని ఎంచుకుని నిరుద్యోగ దీక్షలు చేస్తున్నారు.. ఉన్నత చదువులు చదవి ఉద్యోగం దొరకక ఆత్మహత్య చేసుకున్నవారి కుటుంబాలను పరామర్శించడం.. ఆ తర్వాత ఒక్కరోజు దీక్ష చేసి..…
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నెలకొంది. ఎమ్మెల్యే కోటా, గవర్నర్ కోటా అభ్యర్థుల ప్రకటన రానుంది. ఎమ్మెల్యే కోటాలో ఆరు, గవర్నర్ కోటా లో ఒకటి ఖాళీ అయింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ కు రేపు ఆఖరు తేదీ కావడంతో ఎమ్మెల్సీ అభ్యర్ధుల ప్రకటన చేయనున్నారు సీఎం కేసీఆర్. గుత్తా సుఖేందర్ రెడ్డి, ఫరీ దుద్దీన్, ఆకుల లలిత, కడియం శ్రీహరి, బొడకుంట వెంకటేశ్వర్లు, నేతి విద్యా సాగర్ కు పదవీ కాలం ముగిసింది.…
రెండు పదవులు.. రెండు డజన్ల ఆశావహులు. పాలమూరు జిల్లాలో హీట్ రాజేశారు. ఆ ఇద్దరికే మళ్లీ ఛాన్స్ ఇస్తారా.. లేక కొత్తవారికి అవకాశాలు దక్కుతాయా? పార్టీ ఈక్వేషన్స్ చెబుతున్నదేంటి? ఇద్దరిలో ఒక్కరికి ఛాన్స్ ఇస్తారా? ఉమ్మడి పాలమూరు జిల్లా స్థానిక సంస్థల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. గడిచిన ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి కసిరెడ్డి నారాయణరెడ్డి, కాంగ్రెస్ నుంచి కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి గెలిచారు. కూచుకుళ్ల తర్వాతి కాలంలో టీఆర్ఎస్ కండువా కప్పుకొన్నారు. ఇద్దరూ నాగర్‌కర్నూల్…
ఏపీలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. ఏపీలో భర్తీ కానున్న 11 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల జాబితాను వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ రెడ్డి ప్రకటించారు. మొత్తం 14 లో 7 ఓసీలకు, 7 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ లకు కేటాయించినట్లు ఆయన తెలిపారు. ఇదే ఆఖరు కాదని, ఇప్పుడు సర్దుబాటు చేయలేక పోయిన వారికి…
వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్రకు బ్రేక్ పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వైఎస్ షర్మిల తన పాదయాత్రను వాయిదా వేసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ… ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో ప్రజా ప్రస్థానం పాదయాత్రకు స్వల్ప విరామం ఇవ్వాల్సి వస్తుందని… ఎలక్షన్ కోడ్ అయిపోయిన మరుసటి రోజే పాదయాత్ర ప్రారంభిస్తానని స్పష్టం చేశారు. 21 రోజులు 6 నియోజకవర్గాలు, 150 గ్రామాల్లో చేసిన పాదయాత్రలో వందల సమస్యలు చూశామని… పెన్షన్లు, ఉద్యోగ నోటిఫికేషన్లు,పలు రకాల…