మాజీ డ్రైవర్ సుబ్రమణ్యం హత్యకేసులో ఎమ్మెల్సీ అనంతబాబును గత నెల 23న అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ సమయంలో కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఆ గడువు ఈ నెల 6తో ముగిసింది. అయితే రిమాండ్ ముగియక ముందే ఆన్‌లైన్‌లో విచారణకి హాజరవుతానని మెజిస్ట్రేట్‌ను అభ్యర్థించారు ఎమ్మెల్సీ. ప్రజాప్రతినిధి కావడంతో భద్రతను కారణంగా చూపారు. కేసు తీవ్రత దృష్ట్యా మెజిస్ట్రేట్ ఎమ్మెల్సీ అభ్యర్థనను తిరస్కరించారు. ఇంకేముందీ అనంతబాబు కోర్టుకి హాజరవడం ఖాయమనే ప్రచారం జరిగింది. ఎస్సీ…
ఎమ్మెల్సీ అనంత బాబు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య.. ఏపీలో సంచలనం సృష్టించింది. హత్య కేసులో ఎమ్మెల్సీ పైనే అనుమానాలు వ్యక్తం చేశారు డ్రైవర్ కుటుంబ సభ్యులు. అయినా పోలీసులు పట్టించుకోలేదు. కుటుంబసభ్యు లు, దళిత సంఘాల ఆందోళనలతో మూడు రోజులకు.. నాటకీయ పరిణామాల మధ్య ఈనెల 23న అనంత బాబును అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ విషయంలోనూ పెద్ద సస్పెన్స్ ధ్రిల్లర్ క్రియేట్ చేశారు. వైద్య పరీక్షలు, మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం అంతా ఎమ్మెల్సీకి అనుకూలంగా…
వైసీపీ పాలకులు ప్రజలకు ఎలాగూ రక్షణ ఇవ్వరు.. కనీసం పోలీసులైనా స్వతంత్రంగా వ్యవహరించాలి. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు రాజకీయ బాసుల మాటకు తలొగ్గవద్దు. నేరాలకు పాల్పడేవారికి వత్తాసు పలికేలా అధికార యంత్రాంగాన్ని పాలకులు వినియోగించుకొంటుంటే ఇక శాంతిభద్రతల గురించి ఆలోచన కూడా చేయలేం. కాకినాడలో ఎస్సీ యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో పోలీసుల వ్యవహార శైలి సరిగా లేదన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. హత్య తానే చేశానని ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ ఒప్పుకొన్న తరవాత కూడా…
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చర్చగా మారింది.. తన మాజీ డ్రైవర్ సుబ్రహ్యణ్యాన్ని హత్య చేశాడంటూ అనంతబాబుపై ఆరోపణలు వస్తున్నాయి.. ఈ తరుణంలో.. సజ్జల రామకృష్ణారెడ్డిపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. హత్య చేసిన అనంతబాబు.. సజ్జలను కలిశారంటూ విమర్శించిన ఆయన.. అనంతబాబును మరో 24 గంటల్లో అరెస్ట్ చేయాలి.. లేదంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. హత్య చేసి 72 గంటలైతే.. ఇప్పటి వరకు అరెస్ట్…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు మాజీ డ్రైవర్ సుబ్రమణ్యం అనుమానాస్పద మృతి కేసు నేపథ్యంలో గత రెండు రోజులుగా కాకినాడ జీజీహెచ్ వద్ద ఉద్రిక్త పరిస్దితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే నిన్న రాత్రి సుబ్రమణ్యం భార్యను, కుటుంబ సభ్యలు ఒప్పించి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు. అంతేకాకుండా అర్థరాత్రి వీడియో నడుమ 5గురు వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అంతేకాకుండా సుబ్రమణ్యంది హత్యేనని ప్రాథమిక రిపోర్టు ఇచ్చారు. అయితే నేడు సుబ్రమణ్యం సొంతూరులో అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు కారులో లభ్యమైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతదేహం కేసులో మరో కొత్త కోణం వెలుగు చూసింది. ఐదు నెలల క్రితమే ఆయన వద్ద డ్రైవర్‌గా పని చేసి వదిలేసిన సుబ్రహ్మణ్యం.. రూ. 20 వేలు అప్పుగా తీసుకున్నట్టు కుటుంబీకులు చెప్పారు. నెలకు ఐదు వేలు చొప్పున డబ్బులు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నామని, ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని అనంత బాబు తమని హెచ్చరించాడని వాళ్ళు తెలిపారు. అయితే, నిన్న రాత్రి…