MLC Anantha Babu: కారులో మృతదేహం.. కేసులో మరో కొత్త కోణం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు కారులో లభ్యమైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతదేహం కేసులో మరో కొత్త కోణం వెలుగు చూసింది. ఐదు నెలల క్రితమే ఆయన వద్ద డ్రైవర్‌గా పని చేసి వదిలేసిన సుబ్రహ్మణ్యం.. రూ. 20 వేలు అప్పుగా తీసుకున్నట్టు కుటుంబీకులు చెప్పారు. నెలకు ఐదు వేలు చొప్పున డబ్బులు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నామని, ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని అనంత బాబు తమని హెచ్చరించాడని వాళ్ళు తెలిపారు.
అయితే, నిన్న రాత్రి ఏదో పని ఉందని చెప్పి అనంత బాబు తమ అబ్బాయిని తీసుకువెళ్ళాడని, ఇప్పుడు అతని మృతదేహాన్ని వదిలి వెళ్ళాడని కుటుంబీకులు రోదిస్తున్నారు. ఏం జరిగిందని ప్రశ్నిస్తే.. రాత్రి ఫ్రెండ్ బైక్ ఇచ్చి టిఫిన్‌కి పంపించామని, వేగంతో నడపడంతో బైక్ స్తంభాన్ని ఢీ కొనడంతో చనిపోయినట్టు అనంత బాబు చెప్పాడన్నారు. అయితే, ఆయన స్పష్టంగా చెప్పకపోవడంతో తాము ఆందోళనకు దిగామన్నారు. శవాన్ని కారులో నుంచి త్వరగా దింపాలని ఆయన తమ మీద ఒత్తిడి కూడా చేశాడని సుబ్రహ్మణ్యం కుటుంబీలు వెల్లడించారు. తాము నిరాకరించి కారుకి అడ్డుగా పడుకోవడంతో, వేరే కారులో వెళ్లిపోయాడన్నారు.
Also Read
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
తమ తనయుడు మృతిపై అనుమానాలున్నాయని చెప్తోన్న సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు, అనంత బాబుతో పాటు ఆయన సహచరులే కొట్టి చంపి ఉంటారని ఆరోపణలు చేస్తున్నారు. సుబ్రహ్మణ్యం భార్య గర్భంతో ఉందని, పుట్టింట్లో ఉన్న ఆమెతో రాత్రి ఫోన్‌లో కూడా మాట్లాడాడని అన్నారు. తమకు అన్యాయం జరిగిందని, న్యాయం చేయాలని వాళ్ళు కోరుతున్నారు. మరోవైపు, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
Vijayawada Drugs: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!
-
Gold Keep In House: ఇంట్లో బంగారం, వెండి ఎంత ఉండాలో తెలుసా.. ఇవిగో రూల్స్..
-
Anand Mahindra: 1947 విల్లీస్ జీప్ నుంచి థార్.ఈ వరకు.. ఒక్క వీడియోలో మహీంద్రా 77 ఏళ్ల ప్రయాణం..
-
Andhra Style Amla Pachadi Recipe: ఆంధ్రా స్టైల్ ఉసిరికాయ పచ్చడి.. ఒక్కసారి ఇలా చేస్తే అన్నంలోకి అదిరిపోతుంది!
-
Emraan Hashmi Accident: ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం.. పల్టీ కొట్టిన కారు..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..