ఆంధ్ర పాలనలో లేని దుర్మార్గం టీఆర్ఎస్ పాలనలో నడుస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అన్నారు. హనుమకొండ డీసీసీ భవన్ లో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే సీతక్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. రాహుల్ రాకతో కేసిఆర్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. రాహుల్ పర్యటనపై ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన రిపోర్ట్ తో టీఆర్ఎస్ నేతల్లో భయం మొదలైందన్నారు. కేసిఆర్, కేటీఆర్ లు ఎలక్షన్ టూరిస్ట్ లు…