ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రాజెక్ట్ పోలవరం. కానీ... అదే పోలవరం ఎమ్మెల్యే విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు కొత్త కొత్త వివాదాలు రేగుతూ... రాజకీయంగా చర్చనీయాంశం అవుతున్నాయి. ఆ వ్యవహారాల్లో ఈ జనసేన ఎమ్మెల్యే ప్రమేయం ఉందా లేదా అన్న సంగతి పక్కనబెడితే... వోవరాల్‌గా హైలైట్ అవుతోంది మాత్రం ఆయనే. అది ఇటు ప్రభుత్వానికి, అటు పార్టీకి తలనొప్పిగా మారుతున్నట్టు చెప్పుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా చెప్పుకునే ప్రాజెక్టు రూపుదిద్దుకుంటున్న నియోజకవర్గం పోలవరం. 2024 ఎన్నికల్లో ఊహించని విధంగా ఇక్కడ జనసేన జెండా ఎగిరింది. సరైన క్యాడర్ లేకపోయినా.. నడిపించే నాయకులు లేకున్నా... కూటమి వేవ్‌లో, టిడిపి సహకారంతో జనసేన తరపున గెలిచారు చిర్రి బాలరాజు. ఎన్నికలకు అవసరమైన నిధులు సమకూరే వరకు, ఫలితాలు వచ్చే వరకు అందరితో సఖ్యతగా ఉన్నట్టు వ్యవహరించిన బాలరాజు గెలిచాక మాత్రం విశ్వరూపం ప్రదర్శిస్తున్నారట. సొంతగా జట్టును పెట్టుకుని ప్రతి పనికీ పర్సంటేజ్ ఫిక్స్ చేసి…
జనసేన పార్టీకి చెందిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై రాళ్ల దాడి కలకలం రేపింది.. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు జంక్షన్ వద్ద పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై దాడి జరిగింది.. గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడంతో బాలరాజు కారు అద్దం ధ్వంసమైంది.. ఈ అయితే, ఈఘటనను తీవ్రంగా ఖండించారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.