Attack On Polavaram MLA Balaraju Car: జనసేన పార్టీకి చెందిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై రాళ్ల దాడి కలకలం రేపింది.. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు జంక్షన్ వద్ద పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై దాడి జరిగింది.. గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడంతో బాలరాజు కారు అద్దం ధ్వంసమైంది.. ఈ అయితే, ఈఘటనను తీవ్రంగా ఖండించారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. బర్రింకలపాడు గ్రామంలో కొందరు వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారు. దాడి సమయంలో ఎమ్మెల్యే బాలరాజు వాహనంలో లేకపోవడం వల్ల ఎలాంటి హాని జరగలేదు.. ఈ ఘటనకు కారకులైన వారిని పోలీసులు తక్షణమే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
Read Also: 600KM Walk: 14 రోజుల పాటు 600 కిమీ నడిచి.. స్వగ్రామానికి చేరుకున్న వృద్ధుడు!
అయితే, ఈ ఘటనపై స్పందించిన ఎస్పీ ప్రతాప్ కిషోర్.. అది ఆకతాయిల పనిగా తేల్చారు.. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై రాయి విసిరిన ఘటనతో హుటాహుటిన పోలవరం డీఎస్పీ సురేష్ రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లారని.. మరోవైపు.. ఘటన జరిగిన ప్రాంతంలో జీలుగుమిల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ ప్రాథమిక విచారణ చేశారని ఎస్పీ వెల్లడించారు.. ఇక, ఎస్పీ ఆదేశాలతో పోలవరం డిఎస్పి సురేష్ రెడ్డి, పోలవరం సీఐ క్రాంతికుమార్ అప్రమత్తం అయ్యారు. తక్షణమే పోలీసు రంగ ప్రవేశం చేశారు. ఆపై విచారణ ప్రారంభించారు.. దాడి జరిగింది అనుకునే ప్రాంతానికి జీలుగుమిల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్ వెళ్లారు. అక్కడి పరిసరాల్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అంతగా అనుమానించాల్సిన పరిస్థితులు అయితే ఏమీ లేనట్టుగా సమాచారం. అయినా, సరే పూర్తి స్థాయిలో విచారణ చేసేందుకు పోలీసు అధికారులు సన్నద్ధం అయ్యారు. అయితే, కారు పై రాయి పడడంతో వెనకగా ఉన్న అద్దాలు పగిలిపోయాయి.. ఘటన చోటు చేసుకున్న ప్రాంతంలో హాస్టల్ భవనాలు ఉన్నాయి. దీంతో.. ఇది ఆకతాయిల పనే అయిఉండొచ్చు అంటున్నారు.. అయితే, ఏదేమైనా పోలీసు విచారణ అయితే పూర్తి స్థాయిలో చేసేందుకు ఎస్పీ ప్రతాప్ కిషోర్ ఆదేశాలు జారీ చేశారు.. దీంతో.. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయనున్నారు పోలీసులు.