Missile test: బంగాళాఖాతం ప్రాంతంలో భారత్ ‘‘నో-ఫ్లై’’ జోన్ నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 6-8 మధ్య క్షిపణి పరీక్ష నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్ ప్రకటించింది. 1,480 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న నో-ఫ్లై జోన్ డిసెంబర్ 6న 12:30 UTC నుండి డిసెంబర్ 8న 15:30 UTC వరకు ఈ నో - ఫ్లై జోన్ ఉంటుందని ఉత్తర్వులు చెప్పాయి.
కొరియా ద్వీపకల్పంలో వాతావరణం కాస్త ఉద్రిక్తంగా మారింది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్-ఉన్ వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణి ప్రయోగాత్మక పరీక్షను పర్యవేక్షించారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ మీడియా వెల్లడించింది.
North Korea: ఉత్తర కొరియా మరో క్షిపణిని పరీక్షించింది. ‘‘సాలిడ్ ఫ్యూయల్’’ ఖండాంతర క్షిపణిని పరీక్షించినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా శుక్రవారం వెల్లడించింది. అణు దాడిని ఎదుర్కొనే లక్ష్యంలో ఇది ముందడుగు అని నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అన్నారు. ‘‘హాసాంగ్-18’’ అనే పేరుతో పిలువబడే ఖండాంతర క్షిపణి తమ వ్యూహాత్మక సైనిక శక్తిని పెంచుతుందని, అణుదాడిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచుతుందని కిమ్ అన్నట్లు కేసీఎన్ఏ వార్తా సంస్థ పేర్కొంది.
నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన క్షిపణి ప్రయోగాలకు మరోసారి పనిచెప్పాడు. ఈ రోజు తెల్లవారుజామున వరసగా 3 క్షిపణులను ప్రయోగించాడు. క్షిపణి ప్రయోగాల్లో తగ్గేదే లేదంటున్నాడు. ఉత్తర కొరియ క్షిపణి ప్రయోగాలతో జపాన్, దక్షిణ కొరియా ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ మూడు క్షిపణులను జపాన్ సముద్రం వైపు ప్రయోగించింది నార్త్ కొరియా. ఈ విషయాన్ని సియోల్ మిలటరీ ధ్రువీకరించింది. సునమ్ ప్రాంతం నుంచి మూడు క్షిపణులను ప్రయోగించినట్లు దక్షిణ కొరయి జాయింట్…
ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించగల, దేశీయంగా అభివృద్ధి చేసిన’ప్రళయ్’ క్షిపణిని బుధవారం ఒడిశా తీరంలో అబ్దుల్ కలామ్ దీవి నుండి డీఆర్‌డీఓ విజయవంతంగా ప్రయోగించింది. ”ఈ ప్రయోగంతో అన్ని లక్ష్యాలు నేరవేరాయి. కొత్త క్షిపణి ఆశించిన రీతిలోనే పాక్షిక క్షిపణి పథాన్ని (క్వాసి బాలిస్టిక్ ట్రాజెక్టరీ) అనుసరించింది. నిర్దేశిత లక్ష్యాన్ని ఖచ్చితమైన వేగంతో చేరుకుంది. అన్ని ఉప వ్యవస్థలు సంతృప్తికరంగా పనిచేశాయి.” అని డీఆర్‌డీఓ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ క్షిపణి 150-500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను…
ప్రపంచ వ్యాప్తంగా అణ్వస్త్ర ఆయుధాలపై నిషేధం కొనసాగుతున్న వేళ ఉత్తరకొరియా ‘బాంబు’ పేల్చింది. చాలా దేశాలు అణురహితంగా మారుతున్న వేళ కొరియన్ దేశం క్షిపణి పరీక్ష చేసింది. నార్త్ కొరియా అందరీ కంటే దూకుడుగా అణ్వస్త్రం వైపు అడుగులు వేస్తూ ఆసియా ఖండానికే పెనుముప్పుగా మారింది. ఉత్తర కొరియా ఇప్పుడు ఆహార సంక్షోభంతో అల్లాడుతోంది. దేశంలో ఓవైపు కరోనా, విధ్వంసాలు, ఆహార కొరత వంటి పరిస్థితులు పట్టిపీడిస్తున్నాయి. ఇలాంటి సమయంలో నార్త్ కొరియా ఆయుధాలను సమకూర్చుకునేందుకు మొగ్గుచూపుతుండటం…