Minister Nimmala: నెల్లూరు జిల్లాలో జరిగిన ఘటనకు కులం రంగు పులిమి వైసీపీ విష ప్రచారం చేయడం ఆ పార్టీ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. శవ రాజకీయాలు సృష్టించి ఆ మంటల్లో చలి కాచుకోవాలని చూస్తుందని అన్నారు.
ఎక్స్ (ట్వీట్టర్) వేదికగా స్పందించిన ప్రియాంకా మోహన్.. నన్ను తప్పుగా చిత్రీకరించేందుకు కొన్ని AI-జనరేటెడ్ ఫోటోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. దయచేసి ఇలాంటి నకిలీ దృశ్యాలను షేర్ చేయడం ఆపండి అని కోరింది.
Pakistan: పాకిస్తాన్ తన చరిత్రను తప్పుగా చెప్పుకోవడం అలవాటు. ముఖ్యంగా, భారత్ విషయంలో ఏం జరిగినా, ఎన్ని యుద్ధాల్లో ఓడిపోయినా, చివరకు తూర్పు పాకిస్తాన్ (నేటి బంగ్లాదేశ్)ని కోల్పోయినా కూడా తమదే పై చేయి అని అక్కడి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తూనే ఉంది. చివరకు విద్యార్థులకు నిజాలు తెలియకుండా, తప్పుడు అంశాలను స్కూల్ పాఠ్యాంశాలుగా చేర్చుతోంది. తాజాగా, మే నెలలో జరిగిన ‘‘ఆపరేషన్ సిందూర్’’ గురించి కూడా అక్కడి టెక్ట్స్ బుక్స్‌లో తప్పుడు పాఠ్యాంశాన్ని చేర్చింది.…
అదిగో పులి అంటే ఇదిగో తోక అన్న చందాన, నిన్న మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఒక వార్తను ఎవరో ఒకరు తప్పుగా రాయడం మొదలుపెట్టడంతో, సోషల్ మీడియా అంతా అదే హడావుడితో నిండిపోయింది. అసలు విషయం ఏమిటంటే, ముఖ్యమంత్రి సహాయనిధికి మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయలు విరాళం ఇచ్చారని చెబుతూ, ఒక సోషల్ మీడియా అకౌంట్ నుంచి తొలుత ఒక ట్వీట్ పడింది. వెంటనే దాన్ని బేస్ చేసుకుని, సోషల్ మీడియాలో వేరే అకౌంట్ల నుంచి ట్వీట్లు…
Besan for Pigmentation: ప్రస్తుతం చర్మ సంరక్షణకు సంబంధించిన చిట్కాలకు సంబంధించిన రీల్స్ సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. వీటికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.
Priyanka Chopra : అప్పట్లో ప్రియాంక చొప్రా కొన్ని కామెంట్స్ చేసిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ‘వర్జినిటీ ఉన్న అమ్మాయిని కాదు.. మంచి గుణాలు ఉన్న అమ్మాయిని చేసుకోండి. వర్జినిటీ ఒక్క రాత్రితో పోతుంది. కానీ క్యారెక్టర్, సంస్కారం ఎప్పటికీ ఉండిపోతాయి’ అనే కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ కామెంట్స్ ప్రియాంక చోప్రా చేసిందంటూ పోస్టులు, ట్రోల్స్, మీమ్స్ కనిపించాయి. ఈ కామెంట్స్ పై తాజాగా ప్రియాంక స్పందించింది. Read Also…
గోవుల మరణాలపై జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి నారా లోకేష్ ఖండించారు. "టీటీడీ గోశాలలో గోవుల మరణాలంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. దురుద్దేశపూరిత ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా, వాస్తవాలను టీటీడీ స్పష్టం చేసింది. తప్పుదోవ పట్టించేందుకు, రెచ్చగొట్టేందుకు వైసీపీ పురిగొల్పుతున్న తప్పుడు కథనాలను భక్తులు నమ్మొద్దు. రాజకీయ లబ్ధికోసం పవిత్ర సంస్థలపై అసత్యాలను ప్రచారం చేయడం సిగ్గుచేటు." అని నారా లోకేష్ స్పష్టం చేశారు.
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. రాజమండ్రిలోని లలితా నగర్ ప్రాంత వాసి దేవబత్తుల నాగమల్లేష్ ని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. స్థానిక వీఆర్ఓ ఫిర్యాదు మేరకు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న మల్లేష్ ని అరెస్ట్ చేసినట్లు రాజమండ్రి మూడవ పట్టణ పోలీసులు తెలిపారు. కోర్టులో ప్రవేశ పెట్టిన మల్లేష్ కు రిమాండ్ విధించడంతో రాజమండ్రి జైలుకు తరలించారు.
పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో నిందితుడు గోల్డీబ్రార్ చనిపోయినట్లు జరుగుతున్న ప్రచారాన్ని అమెరికా కొట్టిపారేసింది. కెనడాకు చెందిన గోల్డీబ్రార్ బతికే ఉన్నాడని అమెరికా పోలీసులు తెలిపారు.
Pakistan : పాక్ లోని పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వం, ఆ దేశ సైన్యం శుక్రవారం ఓ అధికారిని అరెస్టు చేసిన తర్వాత పోలీసులకు, ఆర్మీ సిబ్బందికి మధ్య కొనసాగుతున్న వివాదంపై దర్యాప్తు చేయాలని నిర్ణయించాయి.