Besan for Pigmentation: ప్రస్తుతం చర్మ సంరక్షణకు సంబంధించిన చిట్కాలకు సంబంధించిన రీల్స్ సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. వీటికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇన్‌స్టాగ్రామ్ లోని ఓ రీల్‌లో, శనగ పిండితో పిగ్మెంటేషన్‌ను పూర్తిగా తొలగించవచ్చని పేర్కొన్నారు. అది చూసిన కొందరు ఏం ఆలోచించకుండా వాటిని అనుసరిస్తున్నారు. దీంతో అలెర్జీలు, చికాకు, మచ్చలు పెరగడం లేదా చర్మం సహజ పొరకు నష్టం కలిగించే ప్రమాదాలు పెరుగుతున్నాయి. సోషల్ మీడియాలో కనిపించే రీల్స్ అన్నింటినీ నమ్మకండి. ముఖ్యంగా ముఖం, చర్మానికి సంబంధించి జాగ్రత్తలు పాటించాలి.
READ MORE: Extramarital Affairs: భార్యాభర్తలిద్దరు డాక్టర్లే.. భర్త మరొకరితో ప్రేమాయణం సాగిస్తుండడంతో ఘోరం
“శనగ పిండితో పిగ్మెంటేషన్ పూర్తిగా తొలగించబడుతుంది” అని ఒక రీల్‌లో మహిళ పేర్కొంది. ఆమె ఇంట్లోనే శనగ పిండితో ఫేస్ ప్యాక్ తయారు చేసుకుని వాడటంతో.. ముఖంపై ఉన్న అన్ని మచ్చలు తొలగిపోతాయాయని పేర్కొంది. ఇది నిజమేనా? చర్మ నిపుణులు ఏమంటున్నారు? శాస్త్రీయంగా నిపుపణ కాలేదని నిపుణులు చెబుతున్నారు. శనగ పిండిలో తేలికపాటి ఎక్స్‌ఫోలియేటింగ్ లక్షణాలు ఉంటాయి. ఇది చర్మాన్ని శుభ్రంగా, తాజాగా కనిపించేలా చేస్తుంది. కానీ ఇది పిగ్మెంటేషన్ వంటి చర్మ సమస్యలను తొలగించదని నిపుణులు చెబుతున్నారు. చర్మంపై మచ్చలు, నల్లటి మచ్చలు, రంగు సమస్యలు రావడానికి.. హార్మోన్ల మార్పులు, సూర్యరశ్మికి గురికావడం, మెలనిన్ అసమతుల్యత, వాపు లేదా చర్మ రుగ్మత వంటి అనేక కారణాలు ఉండవచ్చు. శనగపిండి వంటి గృహ నివారణలు చర్మాన్ని స్వల్పంగా మాత్రమే ఎక్స్‌ఫోలియేట్ చేయగలవు.
READ MORE: Eye Infection In Rainy Season: వర్షాకాలంలో కంటి ఇన్ఫెక్షన్స్ ప్రమాదం.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే..