కూటమిలో విభేదాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి టీజీ భరత్.. ఇంఛార్జ్ మంత్రిగా అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్టీఏ పార్టీల మధ్య చిన్న, చిన్న విబేధాలు సహజం అన్నారు.. ఇవన్నీ ఒక కుటుంబంలో సభ్యుల మధ్య జరుగుతున్నవే.. అవన్నీ చర్చించుకుని అందరం ఐక్యంగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి భరత్ కీలక వ్యాఖ్యలు.. హైకోర్టు బెంచ్ కోసం కర్నూలులో 25 నుండి 30 ఎకరాల స్థలం సేకరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారని తెలిపారు..
ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్.. నీతి ఆయోగ్ సీఈఓ బి.వి.ఆర్ సుబ్రహ్మణ్యంను కలిశారు. ఉత్పాదక రంగంలో ఆంధ్రప్రదేశ్ సాధించిన పురోగతితో పాటు విజన్ 2047తో పాటు రానున్న ఐదేళ్లలో రాష్ట్రం అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలపై చర్చించారు.