ఖమ్మం జిల్లాలో పర్యటించిన రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై ఆయన మండిపడ్డారు. మాకు కుల, మతల ఫీలింగ్స్ లేవు అని పేర్కొన్నారు. ఈ బాబ్రీ మసీదు కూల్చింది కాంగ్రెస్ పార్టీ హయాంలో కాదా.. ధర్మపురి అర్వింద్ తో చేతులు కలిపి ఎమ్మెల్సీ కవితమ్మను ఓడించలేదా అని ఆయన ప్రశ్నించారు. నాగార్జున సాగర్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కాదా కలిసి పని చేసింది అంటూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శలు గుప్పించారు.
Read Also: Top Headlines@9PM: టాప్ న్యూస్
ఢిల్లీ నుంచి ఒకే విమానంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, టీపీసీసీ చీఫ్ ఈటెల రాజేందర్ కలిసి రాలేదా, సెటిల్మెంట్ మాట్లాడుకోలేదా అంటూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శలు గుప్పించారు. యూనిఫామ్ సివిల్ కోడ్ విషయంలో పార్లమెంట్ లో తెలంగాణకు చెందిన ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలుండి ఒక్కమాటైన మాట్లాడారా.. బరాబర్ మా పార్టీ సెక్యులర్ పార్టీనే అందుకే ఎంఐఎం పార్టీతో పొత్తు పెట్టుకున్నాం అని ఆయన వెల్లడించారు.
Read Also: AP CM Jagan: కొడాలి నాని మేనకోడలి వివాహా వేడుకకు హాజరైన సీఎం జగన్
కాంగ్రెస్ పార్టీ ముస్లీంలకు ఏమి చేసింది అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే ఇంటిగ్రేటెడ్ కబేలాలు కట్టిస్తానంటూ ఆయన పేర్కొన్నారు. ఖమ్మం ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారు.. ప్రభుత్వం చేసిన మంచి పనులు ప్రజలకు తెలుసూ.. ఇంటింటికీ వెళ్ళి చేసిన అభివృద్ది గురించి వివరించి ఓటు అడిగితే చాలని బీఆర్ఎస్ నేతలకు మంత్రి పువ్వాడ సూచించారు. మన సంక్షేమమే మనకు శ్రీరామరక్షగా నిలుస్తుంది అని మంత్రి అజయ్ కుమార్ అన్నారు.