తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి టీఆర్‌ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు. ఖమ్మంలో కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెడితే చూస్తూ ఊరుకోమని ఆమె హెచ్చరించారు. 26న ఖమ్మం వెళ్తున్న అందరి సంగతి తెల్చుతానని ఆమె వెల్లడించారు. పువ్వాడ అజయ్ తన గోతి తాను తీసుకున్నారని, మంత్రిగా బర్తరఫ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కేటీఆర్..పువ్వాడ బిజినెస్ పార్టనర్‌లు అని, కేటీఆర్ అండతో పువ్వాడ రెచ్చిపోతున్నారని ఆమె మండిపడ్డారు. ఏసీపీ ఓవర్ యాక్షన్ ఎక్కువైందని, ఓ వైపు…
ఖమ్మం రాజకీయాలను ఇప్పుడు మంత్రి పువ్వాడ అజయ్ హీటు పుట్టిస్తున్నారు.. బీజేపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందడం ఓవైపు అయితే.. మరోవైపు.. కాంగ్రెస్ నేతలపై కూడా వేధింపులు పెరిగాయంటూ జిల్లా నేతలతో పాటు.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆరోపణలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.. ఇక, ఈ వ్యవహారంపై సీరియస్‌గా స్పందించారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి… పువ్వాడ ఓ సైకో అని కామెంట్ చేసిన ఆయన.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దగ్గర మార్కులు కొట్టేయడానికి పువ్వాడ…
మంత్రి పువ్వాడ అజయ్ వేధింపులతో ఓ యువకుడు ప్రాణాలు తీసుకోవడం ఖమ్మం జిల్లా రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కించాయి.. దీనిపై సీరియస్‌గా స్పందించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. మంత్రి పువ్వాడ, బాధ్యులైన పోలీసులు, నాయకులపై హత్య కేసు నమోదు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.. మరణ వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేయకపోవడం సిగ్గు చేటన్న ఆయన.. సీఎంవో నుండి వచ్చిన ఆదేశాలవల్లే కేసు నమోదు చేయడం లేదని ఆరోపించారు.. బాధ్యులను వదిలిపెట్టే ప్రసక్తేలేదు.. నమ్మిన సిద్ధాంతం…