తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో సమాచార శాఖ కీలక పాత్ర వహించాలని రాష్ట్ర సమాచార, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.
గృహా నిర్మాణ శాఖ కార్యకలాపాలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి గృహ నిర్మాణశాఖ సెక్రటరీ శ్రీనివాసరాజు, స్పెషల్ సెక్రటరీ & గృహ నిర్మాణ సంస్థ ఎండీ విజయేంద్ర బోయి, గృహ నిర్మాణ సంస్థ, గృహ నిర్మాణ మండలి, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.