Ponguleti Srinivasa Reddy: రెవెన్యూ మంత్రి పేరిట వసూళ్లు.. ఇద్దరు అరెస్టు.. మంత్రి పొంగులేటి హెచ్చరిక
- రెవెన్యూ మంత్రి పేరిట వసూళ్లు
- ఇద్దరు వ్యక్తులను నాగోల్ పోలీసులు అరెస్ట్ చేశారు
- మంత్రి పొంగులేటి హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈజీమనీకి అలవాటు పడి సైబర్ మోసాలకు పాల్పడే వారు కొందరైతే.. మరికొందరేమో పొలిటికల్ లీడర్స్ ను అడ్డం పెట్టుకుని సంపాదించాలని చూస్తుంటారు. తప్పు చేస్తే ఎప్పటికైనా దొరకాల్సిందే కదా.. ఇదే రీతిలో ఇద్దరు వ్యక్తులు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డీ పర్సనల్ అసిస్టెంట్స్ మంటూ అమాయకులను మోసం చేస్తున్నారు. చివరికి వీరి బాగోతం బట్టబయలు కావడంతో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్సనల్ అసిస్టెంట్ ( పిఎ) ల మని చెప్పి అమాయకులను మోసగిస్తున్న ఇద్దరు వ్యక్తులను నాగోల్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read:Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేసిన ప్రభాకర్ రావు
Also Read
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
- BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
- Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
- Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బుస్సా వెంకటరెడ్డి ( వయస్సు 34), మచ్చ సురేష్ ( వయస్సు 30) హైదరాబాద్ నాగోల్‌లో నివాసముంటున్నారు. వీరు మంత్రిగారి పీఏలమంటూ రెవెన్యూ అధికారులు, పోలీసులకు ఫోన్లు చేసి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని మంత్రిగారి దృష్టికి వచ్చిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇక నుంచి తన పీఏలమంటూ ఎవరైనా ఫోన్ చేస్తే, ఎలాంటి చిన్న అనుమానం కలిగినా సచివాలయంలోని తన కార్యాలయం 040-23451072 / 040-23451073 నెంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రజలకు సూచించారు. ఎవరైనా ఈ విధంగా అధికారాన్ని దుర్వినియోగపరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
-
Jeevanlal Lavidiya : మాజీ ఐటీ కమిషనర్‌కు మరో షాక్.. భార్యపైనా కేసు.!
-
BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
-
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
-
Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!