హుజురాబాద్ ఉపఎన్నికల వేడి రాజుకుంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ మొదలవడంతో నాయకుల హడావుడి మొదలైంది. నామినేషన్ల ప్రక్రియ ఈనెల 8వరకు కొనసాగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది అక్టోబర్ 13. పోలింగ్ 30న జరుగనుండగా ఫలితం నవంబర్ 2న వెలువనుందని ఈసీ ప్రకటించింది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజే టీఆర్ఎస్ అభ్యర్థి గెలు శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. నేడు కూడా పలు పార్టీల నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ నుంచి ఈటల రాజేందర్ బరిలో…
శాసన మండలిలో కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి కేటీఆర్… మూతపడ్డ అన్ని పరిశ్రమలు తెరిపించడం సాధ్యం కాదని క్లారిటీ ఇచ్చిన ఆయన.. అవకాశం ఉన్న వరకు ప్రయత్నం చేస్తామన్నారు.. ఇక, దేశంలో ఎక్కడా లేని విధంగా 1,32,890 ఉద్యోగాలు భర్తీ చేశామని.. 16 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు, 3 లక్షల ఐటీ కంపెనీలలో ఉద్యోగాలు సృష్టించామని వెల్లడించారు.. భారతదేశాన్ని సాదుతున్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటిగా గుర్తుచేసిన ఆయన.. బీజేపీ మాట సాయం, మూట సాయం చేయడం లేదు..…
తెలంగాణలో పాదయాత్ర నిర్వహిస్తోన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. అధికార టీఆర్ఎస్ పార్టీపై నిప్పులుచెరుగుతున్నారు.. ఇవాళ ఇల్లంతకుంట బహిరంగ సభలో.. మరోసారి తెలంగాణ సర్కార్, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై హాట్ కామెంట్లు చేశారు.. బీజేపీ అధికారంలోకి వస్తే కేటీఆర్‌ను బొక్కలో వేయిస్తాం అంటూ హెచ్చరించిన బండి సంజయ్.. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు కేటీఆరే కారణం అని ఆరోపించారు. ఇక, ధాన్యం కొనుగోలులో కేసీఆర్ బ్రోకర్ మాత్రమే.. కేంద్రమే పూర్తిగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తోందని కామెంట్…
తెలంగాణ ప్రతి అభివృద్ధి పనిలో కేంద్రం పైసలే ఉన్నాయని, బీజేపీని విమర్శించడానికి టీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి అర్హత లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘2023లో తెలంగాణలో భారతీయ జెండాను ఎగురవేస్తాం. నన్ను పార్లమెంటు సభ్యుడిగా గెలిపించినందుకు ప్రజలకు శిరస్సు వంచి నమస్కారం పెడుతున్నా.. తెలంగాణలో ధర్మం గురించి పాటుపడతానని బండి సంజయ్ తెలిపారు. దళిత బంధు సిరిసిల్లలో ఎందుకు ఇవ్వడం లేదన్నారు. ఈరోజు తెలంగాణలో సర్పంచులు పరిస్థితి ఎలా…
ఆయిల్ ఫామ్ వంటి వాణిజ్య పంటలు సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు మంత్రి కేటీఆర్.. సిరిసిల్లలో ఆయిల్ఫామ్ ఫ్యాక్టరీని స్థాపించేందుకు ముందుకు వచ్చిన ఎఫ్‌జీవీ కంపెనీతో సమావేశమైన ఆయన.. రాష్ట్రంలో భారీగా పెరిగిన సాగునీటి సౌకర్యాల నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ, వాణిజ్య పంటల వైపు మల్లాల్సిన అవసరం ఉందన్నారు.. ఇందులో భాగంగా రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయిల్ ఫామ్ పంటల సాగు వైపు రైతులు ఆలోచించాలన్నారు. కాగా, ఈరోజు సిరిసిల్లలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ…
యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తుపదార్థాలతో బానిసలుగా మారుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీని నివారించడంలో విఫలమైందని చెప్పక తప్పడం లేదు అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్ కి రేవంత్ రెడ్డి ఇంటి పైన జరిగిన దాడికి కండిస్తున్నాం. ప్రజాస్వామ్యం లో ఇది ఒక పిరికిపందలు చేసే హీనమైన చర్య అని పేర్కొన్నారు. బీజేపీ నాయకులు బండి సంజయ్ తన వైట్ ఛాలెంజ్ ఒకే చేశారు. కేటీఆర్ రేవంత్…
కేసీఆర్ పాలనలో ప్రమాదంలో ఉంది. రాష్ట్రం మాదకద్రవ్యాల మయం అయ్యింది. వైట్ ఛాలెంజ్ కు స్పందించని కేటీఆర్ ఎందుకు స్పందించలేదు అని పీసీసీ అధికార ప్రతినిధి మానవతా రాయ్ అన్నారు. రేవంత్ రెడ్డి వైట్ ఛాలెంజ్ కు కేటీఆర్ పారిపోయాడు. పరువునష్టం దావా తో కేటీఆర్ పరువు పోయింది అని తెలిపారు. గతంలో జరిగిన డ్రగ్స్ కేసుల విచారణను నీరుగార్చే ప్రయత్నం జరిగింది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎందుకు విచారణ సరిగ్గా జరగదు. డ్రగ్స్ కేసులో కొదరు…
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు…. మరోసారి వరల్డ్ ఎకనమిక్ ఫోరం నుంచి ఆహ్వానం అందింది. దావోస్‌లో 2022లో జరిగే WEF వార్షిక సమావేశానికి… హాజరు కావాలని కేటీఆర్‌ను WEF ప్రెసిడెంట్ బోర్గే బ్రెండే ఆహ్వానించారు. ఈ సమావేశం జనవరి 17 నుంచి 21 వరకు కొనసాగనుంది. తెలంగాణను సాంకేతిక శక్తి కేంద్రంగా మార్చేందుకు కేటీఆర్ చేస్తున్న కృషిని బోర్గే బ్రెండే ప్రశంసించారు. WEF నుంచి ఆహ్వానం అందుకున్న మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం…
మంత్రి కేటీఆర్, ఎంపీ రేవంత్ రెడ్డిల మధ్య టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి మాటల యుద్ధం నడుస్తోన్న విషయం తెలిసిందే.. అయితే తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘కేటీఆర్, రేవంత్ రెడ్డిల భాష చూస్తే అసహ్యం వేస్తుందన్నారు. తెలంగాణ ప్రజలు వారిని గమనిస్తున్నారు. ఒక దైవ కార్యం కోసం అమిత్ షాని కలిస్తే రేవంత్ మాట్లాడం సరైనది కాదు. రేవంత్ రెడ్డి నోరు ఆయనకు అనేక ఇబ్బందులు పెట్టింది. ఇటీవల కాంగ్రెస్…
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ఓ థర్డ్ రేట్ క్రిమినల్ అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. అంతేకాదు దొంగ ఒక పార్టీని లీడ్ చేస్తున్నారని, టీపీసీసీ ‘చీప్ ‘ రేవంత్ అని ఎద్దేవా చేశారు. ఐటీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ గా ఉన్న కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ ను రేవంత్ రెడ్డి గాడిదతో పోల్చిన ఓ న్యూస్ క్లిప్ ను కేటీఆర్ ట్యాగ్ చేస్తూ…