మంత్రి మల్లారెడ్డి ఎలాంటి ప్రసంగంలో ఎలా మాట్లాడారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే.. శుక్రవారం ఆయన అసెంబ్లీని నవ్వులు పూయించారు. వైద్య కళాశాలలు స్థాపించి పేదలకు సేవలందించానని, నాపై ఐటీ దాడులు జరుగుతాయా అధ్యక్షా? ఐదెకరాల్లో రాజ్ భవన్ తరహాలో ఇల్లు కట్టుకున్న ఈటల, వివేక్ వెంకటస్వామిలపై ఐటీ దాడులు జరగాలని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. పేదలకు విద్యనందిస్తున్నందుకే తనపై ఐటీ దాడులు చేసిందని మంత్రి ఫైర్ అయ్యారు. వివేక్, ఈటల రాజేందర్‌లపై ఐటీ దాడులు చేయాలని డిమాండ్ చేశారు. మల్లారెడ్డి మాట్లాడుతూ.. చాయ్ అమ్మినట్లుగా ప్రజా ఆస్తులను అమ్మేస్తున్నారన్నారు. ఇప్పుడు సింగరేణిని కూడా అమ్మాలని చూస్తున్నారని మంత్రి అన్నారు. ఐటీ కంపెనీలు, పరిశ్రమలు, భారీ భవనాల నిర్మాణంతో కార్మికులకు తీరిక దొరకడం లేదన్నారు. కార్మికులకు చేయాల్సిన పని ఉందన్నారు. పేరుకు కార్మిక శాఖ అని, నిధుల కొరత లేదని.. కార్మిక శాఖకు పూర్తి స్థాయిలో నిధులు ఉన్నాయన్నారు.
Also Read : Bhatti Vikramarka : మీరు అధికారంలోకి రావడానికి ముందే ఐటీ హైదరాబాద్‌కి వచ్చింది
‘నేను పాలు అమ్మిన.. పూలు అమ్మిన. కాలేజ్ పెట్టిన.. ఎంపీ అయిన.. ఎమ్మెల్యే అయినా.. కేసీఆర్ దయతో మంత్రి అయ్యా. నా లెక్క ప్రధాని చాయ్ అమ్మి సీఎం అయ్యిండు.. పీఎం అయ్యిండు.. ఇప్పుడు సింగరేణి అమ్ముతుండు.. చాయ్ అమ్మినట్టు పబ్లిక్ ప్రాపర్టీ అమ్ముతున్నారు.. తెలంగాణ ఉద్యమంలో చంద్రుడిలా.. ఇప్పుడు సూర్యుడు లా కేసీఆర్.. అప్పట్లో చల్లని చంద్రున్ని తట్టుకోలేదు.. ఇప్పుడు సూర్యోన్ని తట్టుకుంటారా..? కేటీఆర్ తప్పక సీఎం ఐతడు.. కేసీఆర్ పీఎం ఐతడు’ అని మంత్రి మల్లారెడ్డి అన్నారు.
Also Read : Wins Election Without Contest: పోటీ లేకుండానే గెలుపొందిన బీజేపీ అభ్యర్థి