Kottu Satyanarayana: పవన్ వ్యాఖ్యలపై మంత్రి కొట్టు సత్యనారాయణ ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kottu Satyanarayana: టీడీపీ-జనసేన పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు.. ఇక, పవన్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి కొట్టు సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. చంద్రబాబుతో కలసి వెళ్తాననంటున్న పవన్‌కు దీని పర్యవసానం త్వరలోనే చూస్తారని హెచ్చరించారు. కాపు నాయకులు వంగవీటి రంగాను చంపింది చంద్రబాబు కాదా.. ముద్రగడ కుటుంబాన్ని అవమానించింది చంద్రబాబు కాదా..? చిరంజీవిని అవమానించింది చంద్రబాబు కాదా..? కాపులకు ఇంత ద్రోహం చేసిన వ్యక్తితో కలవడం ఏంటని కాపు సామాజిక వర్గం మొత్తం లబోదిబోమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Nipah Virus: అసలేంటి “నిపా వైరస్”.. దీనికి చికిత్స ఉందా..?
Also Read
ఈ రోజు పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయం కాపులను తలదించుకునేలా చేస్తుందన్నారు మంత్రి కొట్టు.. కాపు వ్యతిరేకి చంద్రబాబు మద్దతు ఇవ్వడం, తగిన మూల్యం నువ్వు చెల్లించుకోవడమే అన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు.. ఇక, పవన్ కల్యాణ్ ఉంటే షూటింగ్ లో.. లేకపోతే చంద్రబాబు కాళ్ల దగ్గర ఉంటాడు.. సంతోషంగా ఉన్న ప్రజలను కష్టాలు పడాలని పవన్ కల్యాణ్ చూస్తున్నారని ఆరోపించారు మంత్రి కొట్టు సత్యనారాయణ. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు.. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ములాఖత్‌లో రాజమండ్రి సెంట్రల్ జైలులో కలిసిన ఆయన.. చంద్రబాబుతో ములాఖత్ ఏపీ రాజకీయాల్లో కీలకమైందని, వైసీపీ అరాచకాలను సమిష్టిగా ఎదుర్కోవాలన్నారు. ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి వెళ్తాయని ప్రకటించారు పవన్.. ఇదే సమయంలో.. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి వెళ్లాలని తన కోరిక అని పేర్కొన్న విషయం విదితమే.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!