Endowment Lands: ఆక్రమణకు గురైన దేవాదాయ భూములను స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ.. దేవాలయ శాఖకు చెందిన భూములకు సంబంధించి సమగ్ర సమాచారం తీసుకుంటున్నాం.. ఆక్రమణలకు గురైన దేవాదాయ భూములకు సంబంధించి ప్రభుత్వం చట్ట సవరణ చేసిందన్న ఆయన.. వారం రోజుల నోటీసుతో పోలీసు ఫోర్స్ తో వెళ్లి ఆ భూములను స్వాధీనం చేసుకుంటామని వెల్లడించారు.. దేవాలయ శాఖకు చెందిన భూములకు సంబంధించి సమగ్ర సమాచారం తీసుకుంటున్నాం.. ఆక్రమణలకు గురైన దేవాదాయ భూములను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోం అన్నారు.. వారం రోజుల నోటీసుతో వాటిని స్వాధీనం చేసుకుంటాం.. ఈ కేసుల్లో 8 ఏళ్ల జైలు శిక్ష కూడా వేసే అవకాశం ఉందన్నారు.
Read Also: Kantara 2 : షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పుడేనా..?
ఇక, వాణిజ్య సముదాయాలు అయితే అద్దె చెల్లింపును పరిగణలోకి తీసుకుంటాం అని తెలిపారు మంత్రి కొట్టు.. మఠాలు, సూత్రాలు, దేవాలయాలకు సంబంధించిన ఆస్తుల వివరాలను పట్టణాల వారీగా ఇవ్వాలని ఆదేశించాం అన్నారు. 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం అన్నారు. మరోవైపు.. దేవాలయాల నిర్వహణకు ముందుకు వస్తే సానుకూలంగా స్పందిస్తాం అన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ.. ధర్మ ప్రచార కార్యక్రమాలు సంవత్సరం పొడుగునా కొనసాగుతాయి.. ఈ నెల 6న అన్నవరం నుంచి ప్రారంభించాం.. ప్రపంచంలోనే హిందూ ధర్మానికి ఒక ప్రత్యేకత ఉంది.. దీన్ని రాజకీయ కోణంలో చూడకూడదు అని హితవుపలికారు. హిందూ ధర్మం గొప్పతనాన్ని మరింత ప్రచారం చేయటం ముఖ్యం.. ధర్మ ప్రచార కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ.