Konda Surekha: సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్ పల్లిలో మంత్రి కొండా సురేఖ, మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే కేసీఆర్ బిడ్డ కవితని జైల్ నుంచి విడిపించడానికి బీజేపీకి ఆమ్ముకుంటాడన్నారు సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత చేసిన లిక్కర్ స్కాం వల్లే ఎంతో మంది తాగుబోతులు అయ్యారని కీలక వ్యాఖ్యలు చేశారు. పదేళ్లలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వని బీఆర్ఎస్ కి కాంగ్రెస్ మహిళలకు రూ.2500 ఇవ్వలేదని విమర్శించడం సరికాదన్నారు. హరీష్ రావు అంత మంచిగా అభివృద్ధి చేస్తే నేడు సిద్దిపేట ప్రచారంకు కెసిఆర్ ఎందుకు వస్తున్నాడు..? అని కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. నీలం మధు పేద బీసీ బిడ్డను అందరూ ఆశీర్వదించాలని మంత్రి కొండా సురేఖ కోరారు. పెళ్లి చేసుకుంటే పిల్లల పుట్టు మచ్చల నుంచి చూస్తాం. ఐదేళ్లు మనల్ని పాలించే నాయకుడి గురించే ఓటేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఐదు హామీలను అమలు చేసిందన్నారు.
Read also: Aravind Kejriwal : కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్.. జూన్ 2న హాజరు కావాలని ఆదేశాలు
పదేళ్లుగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వని టీఆర్ ఎస్ పార్టీకి ఐదు నెలల్లో 2500 ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం సరికాదన్నారు. హరీశ్ రావు ఇంత బాగా అభివృద్ధి చేస్తుంటే కేసీఆర్ సిద్దిపేట ప్రచారానికి ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయారని అన్నారు. టీఆర్‌ఎస్ ఎంపీలు గెలిస్తే బీజేపీకి అమ్ముడుపోతారని విమర్శించారు. “మీకు స్వేచ్ఛ వచ్చింది మరియు మీరు ఎవరి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదు” అని ఆయన అన్నారు. వడ్డెర కులస్తులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మంత్రి కొండా సురేఖ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల బిడ్డగా నన్ను ఆశీర్వదించండి.. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియాగాంధీ వల్లే కేసీఆర్ సీఎం, హరీశ్‌రావు మంత్రి అయ్యారని.. 30 లక్షల ఖాళీ ఉద్యోగాలను నరేంద్ర మోదీ భర్తీ చేయలేదని.. అయినా బీజేపీ.. బీఆర్‌ఎస్ పదేళ్లుగా అధికారంలో ఉండి ప్రజలకు చేసిందేమీ లేదని, కాంగ్రెస్ పార్టీ పేదల కోసం ఆలోచించే పార్టీ అని అన్నారు.
Pakistan : పాకిస్థాన్ నుంచి ఇండియాకు వచ్చిన 200 మందికి పైగా హిందువులు