నల్గొండ ఈద్గాలో బక్రీద్ పండుగ ప్రత్యేక ప్రార్థనల్లో రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మాత్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ముస్లిం సోదరులకు ప్రత్యేకంగా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పండుగ త్యాగాలకు ప్రతీక.. నల్గొండ పట్టణంలో గత 30 సంవత్సరాలుగా మతసామరస్యాన్ని కాపాడుతున్నాం.. పేద ముస్లింలకు ఇండ్లు కట్టిస్తాం అని హామీ ఇచ్చారు. జనాభా పెరుగుతున్న సందర్భంగా ఈద్గాను అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే, ముస్లింలకు విద్యారంగంలో, ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పిస్తాం.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలలో చదువుకున్న ముస్లిం యువతీ యువకులకు అవకాశాలు కల్పిస్తాం.. అందరూ బాగుండాలని అల్లాను ప్రార్థిస్తున్నాను అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
Read Also: Elon Musk: మస్క్ పేల్చిన ఈవీఎం బాంబ్.. భారత్ లో పేలిందిగా?(వీడియో)
కాగా, ఆదివారం ధర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ తల్లి దేవస్థానాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయన అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా కృషి చేస్తుందన్నారు. ఎల్లమ్మ తల్లి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన కల్యాణోత్సవానికి ఆయన తన సతీమణి సబితతో కలిసి హాజరయ్యారు. అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను మంత్రి కోమటిరెడ్డి దంపతులు సమర్పించారు. కల్యాణం తర్వాత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దంపతులకు అర్చకులు వేద ఆశీర్వచనాలు అందజేశారు.