Minister Komatireddy Venkat Reddy: న్యాక్‌లో జాతీయ రహదారులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందన, సెక్రటరీ హరీష్, ఐఏఎస్, ఎన్‌హెచ్‌ఆరోవో రజాక్, ఇతర అధికారులు పాల్గొన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు, ఎన్‌హెచ్-65, మన్నెగూడ, ఆర్మూర్-మంచిర్యాల జాతీయ రహదారులపై ఈ సమావేశ జరిగింది. ప్రజల ప్రాణాలు పోతుంటే నిర్లక్ష్యం తగదని అధికారులకు మంత్రి సూచించారు. వేగంగా పనులు చేస్తే ప్రజల మన్ననలు పొందవచ్చన్నారు.
Read Also: BRS MLA Joins Congress: బీఆర్‌ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లో చేరిన మరో ఎమ్మెల్యే
మన్నెగూడ రహదారికి మార్గం సుగమం చేసేందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఆదేశానుసారం 915 చెట్లను రీలొకేట్ చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కాంట్రాక్టు సంస్థ 300 చెట్లను రీలొకేట్ చేసేందుకు సిద్ధంగా ఉందని, మిగతా 615 చెట్లను అటవీ శాఖ ఆధ్వర్యంలో ఎన్‌హెచ్ అధికారులు రీలొకేట్ చెయ్యాల్సి ఉందన్నారు. దీన్ని వెంటనే ప్రారంభించాలని ఎన్‌హెచ్ ఆర్వో రజాక్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ – విజయవాడ హైవేని గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఉప్పల్ – ఘట్కేసర్ ఫ్లైఓవర్ పనులకు ఆగస్టులో కొత్త టెండర్స్ పిలుస్తామన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ కోసం భూసేకరణ, పనులను వేగవంతం చేయాలని సూచించారు. రీజనల్ రింగ్ రోడ్డు ఫారెస్ట్ క్లియరెన్స్ కోసం జులై మొదటి వారంలో రాష్ట్రానికి నేషనల్ హైవే అథారిటీ కమిటీ వస్తోందని వెల్లడించారు. ఎల్బీ నగర్ – మల్కాపూర్ 6 లైన్ పనులకు అడ్డుగా ఉన్న వాటర్ లేన్, ట్రాన్స్కో అధికారులతో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడారు. వారంలో సమస్యలన్నీ కొలిక్కి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.