మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల వెల్లడిలో తీవ్ర జాప్యం కొనసాగుతూనే ఉంది.. మధ్యాహ్నం 12 గంటలు కావస్తున్నా.. ఇప్పటి వరకు ఐదు రౌండ్లు ఫలితాలే వెల్లడి అయ్యాయి.. ఓవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏదో చేస్తుందనే అనుమానాలు భారతీయ జనతా పార్టీ నేతలు వ్యక్తం చేస్తుండగా.. మరోవైపు.. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జాప్యంపైన అధికార టీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.. రౌండ్లవారీగా ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు వెల్లడి ఆలస్యం అవడంపైన ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి…
కోమటి రెడ్డి కుటుంబాన్ని బీజేపీ కొనుక్కుందని రాష్ట్రమంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో తెచ్చిన అతనికీ, కారణం అయిన వారు సరిగ్గా చెప్పలేక పోతున్నారన్నారు.
ప్రధాని మోడీ, అమిత్ షా... కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అప్పనంగా కట్టబెట్టిన రూ. 18 వేల కోట్లు.. మునుగోడు, నల్గొండ నియోజకవర్గాల అభివృద్ధికి ఇవ్వండి... అలా చేస్తే తాము ఉప ఎన్నికల బరి నుంచి తప్పుకుంటామని ప్రకటించారు మంత్రి జగదీష్ రెడ్డి