ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం.. 2025 - 26 వార్షిక బడ్జెట్‌తో పాటు.. వ్యవసాయ బడ్జెట్‌ను ప్రత్యేకంగా ప్రవేశపెట్టింది.. ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే.. శాసన సభలో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు.. రూ.48,340 కోట్లతో ఏపీ వ్యవసాయ బడ్జెట్ ప్రతిపాదనలను అసెంబ్లీ ముందు ఉంచారు..
వల్లభనేని వంశీ మోహన్ అరెస్ట్‌పై స్పందించిన ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడిని అందరూ చూశారని గుర్తుచేసిన ఆయన.. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరిగింది.. ఇందులో ఎలాంటి రహస్యం లేదని స్పష్టం చేశారు.. అయితే, ఫిర్యాదు చేసిన వ్యక్తి కేసును విత్‌డ్రా చేసుకోవడం ఆశ్చర్యం కలిగించింది.. పార్టీ కార్యాలయంలో పని చేసిన వ్యక్తి ఫిర్యాదు చేస్తే ఇలా జరుగుతుందా..? వాళ్ల కుటుంబంపై ఎంత ఒత్తిడి తెచ్చిఉంటారని ఆగ్రహం…
వైసీపీ హయాంలో తప్పు చేసిన వారిని శిక్షించేందుకు ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. "వైసీపీ పెట్టిన అక్రమ కేసుల్ని నిర్ణీత కాలపరిమితిలో ఎత్తివేసేలా చూడాలని నిర్ణయించాం. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగేలా వారికి చెల్లించాల్సిన మొత్తం భూమి రూపంలో ఇచ్చేలా ఆలోచన చేస్తున్నాం.
విశాఖలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిధిగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. వుడా చైర్మన్ ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో భారీగా మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు చేశారు.
పశు సంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశాలు చేశారు మంత్రి అచ్చెన్నాయుడు.. సచివాలయంలో ఈ రోజు పశుసంవర్ధక, మత్స్య శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు..
విద్య, వైద్యం, వ్యవసాయం, త్రాగు, సాగునీటిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెనాయుడు మాట్లాడుతూ.. గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసింది అని ఆరోపించారు. కొత్త జిల్లాల ఏర్పాటు జరిగాయే కానీ, ఏలాంటి సేవలు అందించడం లేదని పేర్కొన్నారు.
ప్రభుత్వ స్కూళ్లలో కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తామని.. ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహిస్తామని తెలిపారు మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు.. గత వైసీపీ ప్రభుత్వం నాడు నేడు పేరుతో 5 వేల కోట్ల ప్రజాధనం ఖర్చు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రం వెంటిలేషన్ మీద ఉందని.. నేడు వెంటిలేటర్ మీద నుంచి ఆక్సిజన్ తీసుకునే పొజిషన్‌కు వచ్చిందన్నారు. ఎన్నికలలో హామీలు ఇచ్చారు, ఎప్పుడు నెరవేరుస్తారని ప్రశ్నిస్తారు కానీ.. ఈ రాష్ర్టానికి అప్పులు ఉన్నాయని చెబితే వినే పరిస్థితి లేదన్నారు.చంద్రబాబు రాష్ట్రంలో పుట్టడం అదృష్టమన్నారు. క్లిష్ట సమయంలో సీఎంగా చంద్రబాబు ఉన్నారని వెల్లడించారు.
బిందు సేద్యం అమలులో రాష్ట్రం మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులకు సూచించారు. సోమవారం సచివాలయంలో ఉద్యాన శాఖ ఉన్నతాధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు.