రాయలసీమ జిల్లాల్లోని ఏ ఒక్క రైతు ఆదాయం తగ్గకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. సీమ జిల్లాల్లో ఖాళీగా ఉన్న వ్యవసాయ భూముల్లో సాగు ప్రోత్సహించడంతో పాటు రైతులకు మేలు చేకూర్చేందుకు 80 శాతం రాయితీపై విత్తనాలు అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Atchannaidu: శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో అన్న క్యాంటీన్లను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి అంజలి ఘటించిన తర్వాత మంత్రి మాట్లాడుతూ.. శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధిలో 2 అన్న క్యాంటీన్లు ప్రారంభించామన్నారు.
రాష్ట్రంలో విత్తన కొరత లేదు.. వైసీపీ ఏజెంట్ల మాటలు నమ్మి మోసపోకండి అంటూ వైఎస్ షర్మిలకు సూచించారు మంత్రి అచ్చెన్నాయుడు.. గత ఐదేళ్ల అన్న పాలనలో రైతుల బాధలు కనపడకపోవడం బాధాకరమన్న ఆయన.. రాజకీయాల కోసం అటు అన్న, ఇటు చెల్లెలు అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు..
వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించారు.. రాయితీపై బిందు సేద్యం అమలు చేసే అంశంపై చర్చించారు.. రైతులకు తక్షణమే రాయితీపై బిందు సేద్యానికి అవసరమైన ఎక్విప్మెంట్ అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
Atchannaidu: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సమస్యలపై తక్షణ చర్యలు చేపట్టే విధంగా వ్యవసాయ అధికారులు సూచించాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు. నేటి (ఆదివారం) ఉదయం అల్పపీడన ప్రభావం, పంట నష్టం, ఎరువుల లభ్యత తదితర అంశాలపై అధికారులతో ప్రధానంగా చర్చించారు.