Minister Anitha: ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత పులివెందుల, ఒంటిమిట్ట జెడ్‌పీటీసీ ఎన్నికల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బాబాయ్‌ను చంపిన వారికి ఓటు వేయాలా? తల్లికి, చెల్లికి ఆస్తి పంచకుండా కోర్టుకు వెళ్లిన వ్యక్తికి ఓటు వేయాలా? అంటూ ప్రశ్నించారు. అలాగే మంత్రి అనిత మాట్లాడుతూ.. పులివెందులలో ఎన్నికలు ఎప్పుడూ భయపెట్టి, ఏకపక్షంగా జరిపే చరిత్ర ఉందని ఆమె పేర్కొన్నారు. పోలింగ్ బూత్‌ల మార్పు నిర్ణయం ఎన్నికల కమిషన్‌దే తప్ప ముఖ్యమంత్రిది కాదని, అన్ని పార్టీలూ ఈ విషయంలో అభ్యంతరం వ్యక్తం చేయలేదని తెలిపారు. నామినేషన్ చింపేసే రాజకీయాలు గతంలో చాలాసార్లు చూశామని, ఇప్పుడు జగన్ చేస్తున్న విమర్శలు కేవలం మాపై నిందలు మోపడానికి మాత్రమేనని ఆమె వ్యాఖ్యానించారు.
CM Chandrababu: టెక్నాలజీ వినియోగంతో ప్రజల భద్రతపై దృష్టి.. అవేర్ 2.0 లాంచ్!
రేపు (ఆగష్టు 12) ఉదయం 6 గంటల నుంచే హెల్ప్‌డెస్క్ పనిచేస్తుందని, బైండ్ ఓవర్ ఒక నిరంతర ప్రక్రియ అని, నేర ప్రవృత్తి ఉన్న వారిపై అన్ని పార్టీలకీ ఈ చర్యలు ఉంటాయని ఈ సందర్బంగా ఆమె తెలిపారు. పులివెందుల ఎన్నికల విషయంలో జగన్‌కు భయం పట్టుకుందని, నెలలో ఎక్కువ రోజులు బెంగళూరులో ఉంటూ పులివెందుల ప్రజలతో సమీపంలో ఉండరని ఆమె అన్నారు. ఇకపోతే, ఓటర్ల స్లిప్ పంపిణీ ఇప్పటికే పూర్తయిందని గతంలో జగన్‌కు ఉన్న అనుభవాల వల్లే ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె అన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
Nidhhi Agerwal: తెలుగు హీరోయిన్‌కి ప్రభుత్వ వాహనం.. అసలు నిజం ఇదే!
వైసీపీ డీఎన్ఏలోనే దాడులు, దౌర్జన్యం ఉన్నాయని, పులివెందులలో ఓటమి భయం వారిని పట్టుకుందని మంత్రి అనిత అన్నారు. ఓట్లు ఎక్కువా, తక్కువా అన్నది ముఖ్యం కాదని.. ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాలని ఆమె స్పష్టం చేశారు. సొంత చెల్లెలు సునీత న్యాయపోరాటం చేస్తున్నా, ఐదేళ్లు సీఎం పదవిలో ఉన్నా జగన్ న్యాయం చేయలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.