బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పనపీడనం ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తీర ప్రాంతంలో ప్రజలు సముద్రంలోకి వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి.
మూలా నక్షత్రం రోజున ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సరస్వతీ అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. ఈ వేడుకను తిలకించేందుకు భారీగా భక్తులు వస్తారని అంచనా.
నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని మున్సిపాలిటీ పరిధిలోని పేరారెడ్డిపల్లిలో 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తిరుమల లడ్డూ వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Anam Ramanarayana Reddy: నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని మున్సిపల్ కార్యాలయంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి వచ్చాకే రాష్ట్రంలోని అన్ని జలాశయాలు నిండు కుండలా మారాయి అన్నారు. ఇక, మూడు నధుల అనుసంధానం జరిగితే మెట్ట ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి.
BC Janardhan Reddy: 2025 జూన్ లోగా రామాయపట్నం పోర్ట్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు కృషి చేస్తామని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి తెలిపారు. 2019లో సీఎం చంద్రబాబు నాయుడు రామాయపట్నం పోర్ట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.. రూ. 4929 కోట్ల వ్యయంతో పోర్ట్ నిర్మాణం కొనసాగుతుంది.
నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయాన్ని రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణలతో కలిసి రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు.
బెజవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని ఇంకా కొన్ని పనులు చేయాల్సి ఉంది.. అభివృద్ధిలో ఎక్కడ రాజీ పడే పనే లేదు అని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సూచనతో పాలక మండలి కూడా ఏర్పాటు చేస్తామన్నారు.