Minister Anam Ramanarayana Reddy: ప్రతిష్టాత్మకంగా రొట్టెల పండుగ.. ఏర్పాట్లపై మంత్రి ఆనం సమీక్ష..
- బారా షహీద్ దర్గా వద్ద రొట్టెల పండగ ఏర్పాట్లపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక..
- రొట్టెల పండుగను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తాం..
- భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Anam Ramanarayana Reddy: రొట్టెల పండుగ అనగానే నెల్లూరు బారా షహీద్ దర్గా గుర్తుకు వస్తుంది.. మొక్కు కోవడానికి.. మొక్కులు చెల్లించుకోవడానికి.. ఇలా ప్రత్యేక రొట్టులు సమర్పించుకుంటారు భక్తులు.. దీనిని రోటియాన్ కి ఈద్ లేదా రొట్టెల పండుగగా నిర్వహిస్తారు.. ప్రతీ ఏడాది మూడు రోజుల పాటు ఈ పండుగ నిర్వహిస్తారు.. ముహర్రం నెలలో వార్షిక కార్యక్రమం జరుపుకుంటారు. ఆలయాన్ని సందర్శించిన మహిళలు నెల్లూరు ట్యాంక్‌లో రోటీలు మార్చుకుంటారు.. ఇక, బారా షహీద్ దర్గా వద్ద రొట్టెల పండగ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రొట్టెల పండుగను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తాం.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తాం అన్నారు. దర్గా వద్ద ఆగిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేస్తాం.. దర్గా పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించేలా మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రత్యేకంగా వైద్య బృందాలను అందుబాటులో ఉంచుతాం.. రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా అధికారులు సిబ్బంది వ్యవహరించాలని సూచించారు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.
Read Also: Tamannah: వివాదంలో తమన్నా.. 7వ తరగతి విద్యార్థులకి పాఠంగా జీవిత చరిత్ర?
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
ఇక, సమీక్షా సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ.. గతంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో దర్గా ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేశాం.. 2014-19 మధ్య కాలంలో దర్గా అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.20 కోట్ల రూపాయలను మంజూరు చేశారు.. ప్రస్తుతం ప్రభుత్వంలోని ఏ శాఖలోనూ నిధులు లేవు. పురపాలక శాఖకు పన్నుల రూపంలో 3 వేల కోట్ల రూపాయలు వచ్చాయి.. కానీ, వాటిని గత ప్రభుత్వం పూర్తిగా వాడేసిందన్నారు.. దర్గా వద్ద దుకాణాలకు నిర్వహించిన వేలంలో రూ. కోటి 56 లక్షల మేర నిధులు వచ్చాయి.. వాటిని దర్గా అభివృద్ధి కోసం వినియోగిస్తాం అన్నారు.. శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులు ఇబ్బంది పడకుండా సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు మంత్రి నారాయణ.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!