కరోనా రక్కసి కోరలు చాస్తోంది. ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో క్రమక్రమంగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఏపీలో సైతం కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. అయితే తెలంగాణ కరోనా ఉధృతి దృష్ట్యాల విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. అయితే ఏపీలో మాత్రం విద్యాసంస్థలు నడుస్తూనే ఉన్నాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారినపడుతుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. ప్రతి…
ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో తెలంగాణ తరహాలో ఏపీలోనూ విద్యాసంస్థలకు సెలవులు పొడిగిస్తారని అందరూ భావించారు. కానీ ఈ వార్తలపై మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. విద్యాసంస్థలకు సెలవులు పొడిగించే ఆలోచన ఇప్పటికైతే ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో సంక్రాంతి సందర్భంగా ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. మంత్రి సురేష్ ప్రకటన నేపథ్యంలో సోమవారం నుంచి యథావిధిగా విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. Read Also: ఏపీలోనూ…
ఏపీలో పదో తరగతి పరీక్షలపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ క్లారిటీ ఇచ్చారు. పదవ తరగతి పరీక్షలు మార్చిలో నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. సంక్రాంత్రి నాటికి సిలబస్ పూర్తిచేయాలని, 15 నుండి18 ఏళ్ల లోపు విద్యార్థులకు ప్రతి స్కూల్లో 95శాతం వ్యాషినేషన్ పూర్తి చేశామన్నారు. విద్య సంవత్సరం ప్రారంభంలో అమ్మఒడి మూడో విడత ఇస్తామన్నారు. నిబంధనలు పాటించని 375 బీఈడీ, డీఈడీ, కాలేజీలు మూతపడ్డాయని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ప్రైవేటు…
ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తనలో మరో టాలెంట్‌ను బయటపెట్టారు. తన కుమార్తె వివాహ వేడుకలో డ్యాన్సులు వేసి అదరగొట్టారు. ఇటీవల హైదరాబాద్‌లో మంత్రి ఆదిమూలపు సురేష్ కుమార్తె శ్రిష్టి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సీఎం జగన్ సతీమణి భారతి సహా పలువురు మంత్రులు, ఎంపీలు హాజరయ్యారై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా అతిథులను ఉత్సాహపరిచేందుకు మంత్రి ఆదిమూలపు సురేష్ తన కుమార్తెతో కలిసి డ్యాన్స్ వేశారు. Read Also:…
ఏపీలో ఇటీవల ఎన్నికైన 11 మంది కొత్త ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం కార్యక్రమం మండలిలో జరుగుతోంది. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. మండలిలో బలం ఉందని ప్రతిపక్షం ఎలా వ్యవహారించిందో చూశామని, ఈ రోజు శుభదినమన్నారు. పార్టీని నమ్ముకున్న వారికి జగన్ తప్పక న్యాయం చేస్తారనడానికి ఇదే నిదర్శనమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రతి ఎన్నికల్లో విజయం సాధిస్తున్నామని, నేతల మధ్య విభేదాలున్నా కలిసి కట్టుగా పని చేసి, ప్రజల…
రాష్ట్రంలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు ఆపాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఏపీ సర్కార్ ఎయిడెడ్ స్కూళ్లను మూసివేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం విద్యను పేద విద్యార్థులకు అందకుండా ప్రతిపక్ష నేతలు ఏపీ ప్రభుత్వం మండిపడుతున్నారు. దీనిపై స్పందించిన మంత్రి సురేస్ ఎయిడెడ్ స్కూళ్లను తాము ప్రక్షాళన చేస్తున్నామని వ్యాఖ్యానించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటినే మూసివేస్తున్నామని.. ప్రైవేటు విద్యకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని ఆయన అన్నారు. ప్రభుత్వం చేసే మంచి పనిని పక్కన…
ఏపీ ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల చేసారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. ఏపీ ఈఏపీ సెట్ లో ఇంజనీరింగ్, అగ్రి, ఫార్మా కు మొత్తంగా 2, 59, 688 విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అగ్రి, ఫార్మా ప్రవేశ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు 83,820. అందులో పరీక్షలకు 78,066 మంది హాజరుకాగా 72,488 మంది విద్యార్థులు అర్హత సాధించారు. హాజరైన విద్యార్థుల్లో మొత్తం 92.85% మంది విద్యార్థులు అర్హత పొందారు. ఇక రేపటి నుంచి…
ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ ఫలితాలు విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.. రేపు సాయంత్రం 5 గంటలకు ఎస్‌ఎస్‌సీ ఫలితాలు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించనున్నారు.. కరోన మహమ్మారి కారణంగా 2020, 2021 పదో తరగతి పరీక్షలను రద్దు చేసింది ప్రభుత్వం.. దీంతో.. ఆయా సంవత్సరాల్లో టెన్త్ పరీక్ష ఫీజు చెల్లించినవారంతా పాస్ అయిపోయినట్టే.. అయితే, గ్రేడ్లపై కొంత కసరత్తు జరిగింది.. దీని కోసం హైపవర్ కమిటీ ఏర్పాటు చేసింది సర్కార్.. ఇక, హైపవర్ కమిటీ…
ఆగస్టు 16వ తేదీ నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభం అవుతాయని.. తగిన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. జగనన్న విద్యాదీవెనపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆగస్టు 16న రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు తిరిగి ప్రారంభించటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని.. ఉపాధ్యాయులకు ఆగస్టు 16లోగా 100శాతం బూస్టర్ డోస్ తో పాటు పూర్తిచేయాలని సీఎం ఆదేశించినట్టు వెల్లడించారు. ఇక, విద్యాకానుక రెండవ సారి అన్ని స్కూళ్ళలో అందించేందుకు…