కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే టెన్త్, ఇంటర్ పరీక్షలను కూడా రద్దు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఎలాగైనా బోర్డు ఎగ్జామ్స్ నిర్వహించాలనే పట్టుదలతో ఏపీ ఉన్నా.. సుప్రీంకోర్టు డెడ్‌లైన్‌తో వెనక్కి తగ్గి.. పరీక్షలు రద్దు చేస్తూ ప్రకటన చేసింది.. ఇక, ఫలితాలు ఎప్పుడు ప్రకటిస్తారు..? అని అంతా ఎదురుచూస్తున్న నేపథ్యంలో.. పరీక్షల ఫలితాలపై క్లారిటీ ఇచ్చారు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్… ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. రెండు, మూడు రోజుల్లో 10వ తరగతి ఫలితాలు…
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదంలో కొనసాగుతూనే ఉంది.. కేంద్రం గెజిట్లు విడుదల చేసినా.. మంత్రులు, నేతల మధ్య హాట్ కామెంట్లు కొనసాగుతూనే ఉన్నాయి.. ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. జల జగడం విషయంలో స్పందిస్తూ.. ఎన్నికల కోసమో, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కోసమో.. ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టడం తెలంగాణకి మంచి పద్దతికాదని హితవుపలికారు.. ఏపీకి రావాల్సిన నీళ్లు ఒక్క చుక్క తగ్గినా ఒప్పుకోమని స్పష్టం చేసిన ఆయన..…
విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలనే పట్టుదలతో అడుగులు ముందుకు వేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చివరకు ఆ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.. కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడియన మంత్రి ఆదిమూలపు సురేష్.. సుప్రీంకోర్టులో పరీక్షలపై విచారణ జరిగిన విషయాన్ని వెల్లడించారు.. పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ఫలితాల ప్రకటనకు 45 రోజుల సమయం పడుతుందన్న ఆయన.. కానీ, సుప్రీకోర్టు చెప్పిన విధంగా వచ్చే నెల 31 నాటికి పరీక్షల ప్రక్రియ పూర్తి చేయడం సాధ్యం…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.. రాష్ట్రంలో పరీక్షల నిర్వహణపై అఫిడవిట్ వేయలేదని, రెండు రోజుల్లో దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అసలు ఆంధ్రప్రదేశ్‌ను ఎందుకు మినహాయించాలో చెప్పాలంటూ నిలదీసింది అత్యున్నత న్యాయస్థానం… ఒక్క విద్యార్థి ప్రాణం పోయినా రాష్ట్రమే బాధ్యత వహించాలని వ్యాఖ్యానించింది. దీనిపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు.. పరీక్షల ఆవశ్యకతను సుప్రీంకోర్టుకు వివరించామన్న ఆయన.. పరీక్షల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు…
ఇంటర్, పదో తరగతి పరీక్షలను ఇప్పట్లో పెట్టే పరిస్థితి లేదని.. విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో రకరకాల ప్రతిపాదనలు పరిశీలించామని.. స్పష్టత వచ్చాక షెడ్యూల్ ప్రకటిస్తామన్నారు.పరీక్షల నిర్వహణ విషయమై కొన్ని పార్టీలు రాజకీయం చేయాలని అనుకుంటున్నాయని..కోవిడ్ పరిస్థితి ఉందనే పరీక్షలను వాయిదా వేశామని వెల్లడించారు. పరీక్షల నిర్వహణ విషయంలో అనేక మార్గాలుంటే.. పరీక్షల రద్దు అనే మాట ఎందుకు..? అని ప్రశ్నించారు. లోకేష్ పరీక్షల్లో నిలబడకుండా దొడ్డి దారిన పదవులు పొందారో..…
కరోనా వైరస్‌తో ఇప్పుడు పరీక్షలు వాయిదా వేసినా.. పరిస్థితి అనుకూలించిన తర్వాత టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించడం తప్పనిసరి అన్నారు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. జూన్ 7వ తేదీ నుంచి జరగాల్సిన 10వ తరగతి పరీక్షలను వాయిదా వేయాల్సిందిగా సీఎం వైఎస్ జగన్ ఆదేశించారన్న ఆయన.. ఇంటర్ పరీక్షలపై కూడా నిర్ణయం తీసుకుంటామన్నారు.. అయితే, టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకుంటున్నామని…
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది… రెబల్ ఎంపీపై మండిపడుతోన్న వైసీపీ నేతలు.. ఆయన అరెస్ట్‌ను సమర్థిస్తూ వస్తున్నారు.. ఇక, ఈ వ్యవహారంపై మీడియాతో మాట్లాడిన ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్… ఎంపీ రఘురామకృష్ణంరాజు గెలిచిన పార్టీని, సీఎంని విమర్శించడం దుర్మార్గం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. రఘురామకృష్ఱంరాజు విలువలు లేని రాజకీయం చేశాడంటూ ఫైర్ అయిన ఆయన.. సంవత్సరం నుండి రాష్ట్రంతో సంబంధాలు…