Vishnu Kumar Raju: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా పర్యటన నేపథ్యంలో యర్రగొండపాలెంలోని మంత్రి ఆదిమూలపు సురేష్ క్యాంపు కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ శ్రేణులు, టీడీపీ శ్రేణులు ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకోవడంతో వైసీపీ కార్యకర్తలు ఇద్దరికి, చంద్రబాబుకు సెక్యూరిటీ అధికారికి గాయాలైనట్టు చెబుతున్నారు.. ఇక, మంత్రి ఆదిమూలపు సురేష్.. తన టీ షర్ట్ విప్పిన విషయం విదితమే.. అయితే.. దీనిపై స్పందించిన బీజేపీ సీనియర్…
Minister Adimulapu Suresh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా యర్రగొండపాలెంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్ని విషయం విదితమే.. అయితే, ఈ వ్యవహారం ఒకరిపై ఒకరు.. అన్నట్టుగా టీడీపీ, వైసీపీలు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి.. ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించారు మంత్రి ఆదిమూలపు సురేష్.. చంద్రబాబు పర్యటన సందర్భంలో దళితుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన చంద్రబాబు, లోకేష్ క్షమాపణ చెప్పాలని శాంతియుతంగా నిరసన తెలిపామన్న ఆయన.. మేం దాడి చేయలేదని ప్రమాణం చేయడానికి సిద్ధం.. టీడీపీ నేతలు వస్తే…
Minister Adimulapu Suresh: జగనన్నే మన భవిష్యత్ పేరుతో సాగుతోన్న కార్యక్రమంపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఈ స్థాయిలో ప్రజల మధ్యకు వెళ్ళే సాహసం చేయలేదు.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందాయా లేదా అని ప్రజలను అడిగిన ప్రభుత్వం లేదు.. ఒక్క వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, సీఎం వైఎస్ జన్ తప్ప అంటున్నారు మంత్రి ఆదిమూలపు సురేష్.. రెండో వారం మెగా పీపుల్స్ సర్వే…
Minister Adimulapu Suresh: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి ఆదిమూలపు సురేష్.. పవన్ కల్యాణ్ నిలకడ లేని మనిషిగా పేర్కొన్న ఆయన.. పవన్ రాజకీయ వ్యభిచారం చేస్తున్నాడు అంటూ ఫైర్ అయ్యారు.. ఒక వైపు బీజేపీతో అంటకాగుతూ మరోవైపు టీడీపీ ముసుగులో పని చేస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు.. అసలు పవన్ కల్యాణ్ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాడో.. ఎవరితో పొత్తు పెట్టుకుంటున్నాడో.. రాష్ట్ర ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.. అయితే,…
Adimulapu Suresh: సీఎం వైఎస్ జగనే బ్రాండ్ అంబాసిడర్.. సీఎం పరిపాలనే మా పబ్లిసిటీ.. ఏపీలో కల్పిస్తున్న వసతులే మా మంత్రం అని వ్యాఖ్యానించారు మంత్రి ఆదిమూలపు సురేష్.. ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. మీడియాతో మాట్లాడుతూ.. లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావడానికి సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మీద ఉన్న నమ్మకమే కారణంగా చెప్పుకొచ్చారు.. అందుకే సీఎం జగనే మా బ్రాండ్ అంబాసిడర్.. సీఎం పరిపాలనే మా పబ్లిసిటీగా అభివర్ణించారు.. పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ధి…
Adimulapu Suresh: వచ్చే ఎన్నికల్లో పోటీపై.. పొత్తులపై ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే చర్చ హాట్ హాట్‌గా సాగుతోంది.. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వెళ్తాయా? లేక టీడీపీ, జనసేన మైత్రితో ముందుకు వెళ్తాయా? లెఫ్ట్ పార్టీలు ఎటువైపు.. అనే చర్చ సాగుతోంది.. అయితే, అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం.. మరోసారి సింగిల్‌గానే బరిలోకి దిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.. సింహం సింగిల్ గానే వస్తుంది.. వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది అని వ్యాఖ్యానించారు మంత్రి ఆదిమూలపు సురేష్..…
YSRCP: ఆంధ్రప్రదేశ్ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అనూహ్యంగా హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చేరారు. కొంతకాలంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మోకాలి నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆస్పత్రిలో చేరి వైద్యుల సూచన మేరకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. గురువారం ఈ ఆపరేషన్ విజయవంతం అయినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు మంత్రి సురేష్ వీల్ ఛైర్‌లో ఉన్న ఫోటోను వైద్యులు విడుదల చేయగా సోషల్ మీడియాలో అది వైరల్‌గా మారింది. Read…
కోనసీమ జిల్లా పేరు మార్చడం.. కోనసీమ జిల్లాను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమగా పేరు మార్పు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రాథమిక ఉత్తర్వులు జారీ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. నిన్న విధ్వంస ఘటనలు చోటు చేసుకున్నాయి.. అయితే, ఈ ఆందోళలనపై మండిపడ్డారు మంత్రి ఆదిమూలపు సురేష్.. అన్ని వర్గాల సూచన, కోరిక మేరకే అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చటం జరిగిందన్న ఆయన.. అంబేద్కర్ ఒక కులానికో ఒక వర్గానికో చెందిన వాడు కాదు.. అంబేద్కర్…
ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం మండలం మురారిపల్లెలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి ఆదిమూలపు సురేష్.. మరోసారి విపక్ష టీడీపీపై ధ్వజమెత్తారు. జగన్‌ని ఒంటరిగా ఎదుర్కోలేకే చంద్రబాబు దత్తపుత్రుడ్ని (పవన్ కళ్యాణ్) తీసుకొస్తున్నాడని విమర్శించారు. 2009లో వైఎస్‌ని ఎదుర్కోవడానికి మహాకూటమి పేరుతో అన్ని పార్టీలు ఏకమై బొక్కబోర్లాపడ్డాయని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా జగన్‌ని కదిలించలేరని చెప్పారు. సీఎం జగన్ ఎవరికీ అందనంత ఎత్తులో ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించారని, రాజశేఖరరెడ్డి…