Adimulapu Suresh: సీఎం వైఎస్ జగనే బ్రాండ్ అంబాసిడర్.. సీఎం పరిపాలనే మా పబ్లిసిటీ.. ఏపీలో కల్పిస్తున్న వసతులే మా మంత్రం అని వ్యాఖ్యానించారు మంత్రి ఆదిమూలపు సురేష్.. ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. మీడియాతో మాట్లాడుతూ.. లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావడానికి సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మీద ఉన్న నమ్మకమే కారణంగా చెప్పుకొచ్చారు.. అందుకే సీఎం జగనే మా బ్రాండ్ అంబాసిడర్.. సీఎం పరిపాలనే మా పబ్లిసిటీగా అభివర్ణించారు.. పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ తమ లక్ష్యంగా తెలిపారు.. పెట్టుబడిదారుల సదస్సు ఉద్యోగ కల్పన లక్ష్యంతో ముందుకు తీసుకోపోవడం జరిగిందని వెల్లడించారు.. ఆరు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు రాబోతున్నాయని తెలిపారు.
Read Also: Anand Mahindra: వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్ర.. మీరు కూడా నీటిపై పరుగెత్తవచ్చు..!
గత పాలకులు పేపర్లకే పరిమితం అయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి సురేష్. ప్రతిపక్షాలు దీనిపై కూడా రాజకీయం చేస్తున్నాయని.. కానీ, అభివృద్ధి, సంక్షేమాన్ని మా ప్రభుత్వం రాజకీయం కోసం వాడలేదని స్పష్టం చేశారు. సంక్షేమ కార్యక్రమాలు రాజకీయాలకు అతీతంగా అందరికి ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు.. ప్రతిపక్షాలు మూడు సార్లు సమ్మిట్లు పెట్టి ఎన్ని లక్షల కోట్లు తెచ్చారో చర్చకి మేం సిద్ధం అంటూ సవాల్ విసిరారు మంత్రి ఆదిమూలపు సురేష్. కాగా, మార్చి 3, 4 తేదీల్లో విశాఖ వేదికగా జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్)లో.. భారీగా పెట్టుబడులు రాబట్టకలిగింది వైఎస్ జగన్ సర్కార్.. జీఐఎస్ వేదికగా కీలక సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకుంది ప్రభుత్వం.. ఈ పెట్టుబడుల ద్వారా రానున్న కాలంలో రాష్ట్రంలో 6 లక్షల మందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని ప్రభుత్వం చెబుతున్నమాట.