Minister Adimulapu Suresh: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి ఆదిమూలపు సురేష్.. పవన్ కల్యాణ్ నిలకడ లేని మనిషిగా పేర్కొన్న ఆయన.. పవన్ రాజకీయ వ్యభిచారం చేస్తున్నాడు అంటూ ఫైర్ అయ్యారు.. ఒక వైపు బీజేపీతో అంటకాగుతూ మరోవైపు టీడీపీ ముసుగులో పని చేస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు.. అసలు పవన్ కల్యాణ్ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాడో.. ఎవరితో పొత్తు పెట్టుకుంటున్నాడో.. రాష్ట్ర ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.. అయితే, రాష్ట్రంలోని 175 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు నిలబడి.. చేసిన సంక్షేమ పథకాల గురించి చెబుతాం అన్నారు.
Read Also: Kolagatla Veerabhadra Swamy: పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం.. అప్పులు సహజం..!
మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ నేతల వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు మంత్రి సురేష్.. టీడీపీ నాయకులు వాపుని చూసి బలుపని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.. తమతో వైసీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు.. మరి టీడీపీతో టచ్ లో ఉన్న ఆ వైసీపీ ఎమ్మెల్యేలలు ఎవరో చెప్పాలని సవాల్ చేశారు.. 175 నియోజకవర్గాల్లో టీడీపీకి అభ్యర్థులే లేరు.. అందుకే పొత్తులకు వెళ్తున్నారని పేర్కొన్నారు.. ముందస్తు ఎన్నికలు లేవని సీఎం వైఎస్ జగన్ స్పష్టత ఇచ్చారు… టీడీపీ ప్రభుత్వంలో చేసిన సీమెన్స్ స్కామ్ బయటపడింది. 300 కోట్ల రూపాయల సీమెన్స్ స్కామ్ జరిగిందని.. సీమెన్స్ స్కామ్ లో చట్టం తనపని తాను చేసుకుపోతుందని తెలియజేశారు మంత్రి ఆదిమూలపు సురేష్.