రైతులు ధైర్యంగా ఉండండి.. నష్టపోయిన ప్రతి రైతుకు ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇస్తాం అన్నారు మంత్రి అంబటి రాంబాబు.. మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో పల్నాడు జిల్లా తీవ్రంగా నష్టపోయిందన్నారు. అత్యధికంగా చిలకలూరిపేట నియోజకవర్గంలో వర్షపాతం నమోదైంది.. ఈ తుఫాన్ తో రైతాంగం పంటలు కోల్పోయారు.. మిర్చి, అరటి, పత్తి , బెంగాల్ గ్రామ్ పంటలు పూర్తిగా పాడైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Vijay: చెన్నై వరదల్లో చిక్కుకుంది. మిచౌంగ్ దెబ్బకు.. చెన్నై మొత్తం నీట మునిగింది. సాధారణ ప్రజలే కాదు సెలబ్రిటీలు సైతం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. దీనివలన ఎంతోమంది నిరాశ్రయులు అయ్యారు. తిండి లేక అల్లాడుతున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా .. ఇంకా పలు గ్రామాల్లో ఎంతోమంది ఆకలికి అలమటిస్తున్నారు.
181.5 mm rainfall in AP: ఏపీలో ‘మిచాంగ్’ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. తుపాను ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో గత 2-3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటల పాటు కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే కురిసిన వర్షాలతో ఏపీ తడిసి ముద్దయింది. తుఫాన్ దాటికి వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. చాలా ప్రాంతాలు జలమయం అవ్వగా.. రోడ్డుపైకి భారీగా వరదనీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాల్లో చేతికి…
Heavy Rains in AP Due to Cyclone Michaung: బంగాళాఖాతంలో ఏర్పడిన మిచాంగ్ తుపాన్ వాయుగుండంగా బలహీనపడింది. ఈ వాయుగుండం ఈరోజు మధ్యాహ్నానికి అల్పపీడనంగా బలహీనపడే అవకాశముంది. మిచాంగ్ ప్రభావంతో ఏపీలో ప్రస్తుతం వర్షాలు ఉరుస్తున్నాయి. మరో 24 గంటల పాటు కోస్తాంధ్ర, రాయలసీమతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం దాములూరు వద్ద వైరా,…
Heavy Crop damage in AP: మిచాంగ్ తుఫాను ప్రభావంతో ఏడతెరుపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని కాలనీలు జలమయంగా మారాయి. గోరింకల డ్రైన్ పొంగి పొర్లుతోంది. వర్షాలకు వరి చేలు మొత్తం నేలకొరిగాయి. చేతికి అందివచ్చిన పంటలు దెబ్బ తినడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోనసీమ జిల్లాలో పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లితో పాటు అనేక మండలాలలో వరి చేలు దెబ్బతిన్నాయి. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు అంటున్నారు. మిచాంగ్ తుఫాన్…
మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో గత రెండు రోజులుగా ఇల్లందు సింగరేణి ఏరియాల్లో ఎడ తెరిపిలేని వర్షం కురుస్తుంది. భారీ వర్షానికి బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. కోయగూడెం ఉపరితల గనిలో 13 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 45 వేల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు నిలిచిపోయింది.
Many trains canceled on Wednesday in AP: ‘మిచాంగ్’ తుపాను ఏపీలోని పలు జిల్లాలను కుదిపేసింది. తుపాను ప్రభావంతో కురుస్తున్న కుండపోత వర్షాలకు జన జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలు, 80-110 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురు గాలులతో ఏపీలోని పట్టణాలు, పల్లెలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ప్రధాన రోడ్లపై మోకాళ్ల లోతుకు పైగా నీళ్లు ఉండడంతో…
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాన్ మిచౌంగ్ తీరం దాటింది. ఏపీలోని బాపట్ల సమీపంలో తుఫాన్ తీరం దాటిన సమయంలో బీభత్స వాతావరణం కనిపించింది. తీర ప్రాంతంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం హోరెత్తింది. సముద్రంలో అలలు... ఐదు నుండి ఆరు అడుగుల మేర ఎగిసిపడ్డాయి. అల్లవరం సమీపంలో సముద్రం అలకల్లోలంగా మారింది.
మంగళవారం తమిళనాడులోని చెన్నైలో మిచాంగ్ తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో నీటిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు పడవలు, ట్రాక్టర్లను ఉపయోగించారు. మంగళవారం ఉదయం నుండి చెన్నైలోని చాలా ప్రాంతాల్లో వర్షం ప్రభావం తక్కువగానే ఉంది. దీంతో రెస్క్యూ, రిలీఫ్ కార్యకలాపాలను అధికారులు వేగవంతం చేశారు. ఇదిలా ఉంటే.. చెన్నై, ఇతర ప్రాంతాలలో వరదల ధాటికి 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది గాయపడగా.. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని…