టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నాలుగు నెలల తర్వాత మైదానంలోకి దిగేందుకు సిద్దమయ్యాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో నేడు జరిగే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తరఫున బుమ్రా ఆడనున్నాడు. గత జనవరిలో గాయపడిన బుమ్రా.. ఆర్సీబీతో మ్యాచ్‌లోనే ఆడతాడని ఇప్పటికే ముంబై కోచ్ వెల్లడించాడు. బుమ్రా ఐపీఎల్ ఎంట్రీ నేపథ్యంలో ఆర్సీబీ ఆటగాడు టిమ్ డేవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా వేసిన…
విరాట్ కోహ్లీ అంటే క్రికెట్ అభిమానులకు ఎంతో పిచ్చి.. అతని ఆటను చూసేందుకు ఎక్కడికైనా వెళ్లే వీరాభిమానులు ఉన్నారు. అంతేకాకుండా.. అతని ఫొటోను చేతులపై, గుండెలపై టాటూలు వేసుకున్న పిచ్చి అభిమానులు కూడా ఉన్నారు. కోహ్లీ బ్యాటింగ్ కోసం రంగంలోకి దిగాడంటే చాలు.. అభిమానులు విరాట్ విరాట్ అంటూ.. ఎంకరేజ్ చేస్తుంటారు. కోహ్లీకి కూడా గ్రౌండ్లో ఉండి అభిమానులను ఉత్సహపరిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. అప్పుడప్పుడు గ్రౌండ్లో డ్యాన్స్లు, క్రికెటర్లతో జోక్స్ చేస్తూ కనిపిస్తాడు.
Rohit Sharma Funny Comments on Dinesh Karthik: ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం వాంఖడేలో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చాలా ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. అభిమానులు హార్దిక్ పాండ్యాను గేలి చేస్తుంటే విరాట్ కోహ్లీ అడ్డు చెప్పడం.. రోహిత్ శర్మను విరాట్ గిల్లడం.. జస్ప్రీత్ బుమ్రాకు మహమ్మద్ సిరాజ్ శిరస్సు వంచి సలాం కొట్టడం లాంటి సన్నివేశాలు జరిగాయి. అయితే అన్నింటిలోకెల్లా.. దినేశ్ కార్తీక్‌ను రోహిత్ శర్మ…
Mumbai Indians bowler Jasprit Bumrah creates history in IPL against RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)పై 5 వికెట్ హాల్ సాధించిన తొలి బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం వాంఖడేలో ఐదు వికెట్స్ తీసిన అనంతరం ఈ రికార్డును తన పేరుపై లిఖించుకున్నాడు. బెంగళూరుపై తన నాలుగు…
Mohammed Siraj Hugs Jasprit Bumrah after 5 Wicket Haul in MI vs RCB: ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం వాంఖడేలో మైదానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగాడు. సహచర, ప్రత్యర్థి బౌలర్లు తేలిపోయిన వాంఖడే పిచ్‌పై బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఒక్కో బౌలర్ 40, 50 పరుగులు సమర్పించుకుంటే.. బుమ్రా మాత్రం తన నాలుగు ఓవర్ల కోటాలో 21 రన్స్…
Faf du Plessis on RCB Defeat vs MI: ముంబై ఇండియన్స్‌పై ఓటమిని తాము అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాం అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తెలిపాడు. ఈ వికెట్‌పై 190 పైగా స్కోర్‌ను డిఫెండ్ చేసుకోవడం అంత ఈజీ కాదని, పవర్‌ప్లేలో తాము మరి కొన్ని పరుగులు సాధించింటే బాగుండేందన్నాడు. జస్ప్రీత్ బుమ్రా అద్బుతంగా బౌలింగ్ చేశాడని, అతడు ఎక్కువ పరుగులు చేయడకుండా అడ్డుకున్నాడని డుప్లెసిస్ చెప్పాడు. ఈ మ్యాచ్‌లో బెంగళూరు 8…
Suryakumar Yadav Batting Video vs RCB Goes Viral: గాయాల కారణంగా దాదాపుగా మూడు నెలల అనంతరం ఐపీఎల్ 2024లో అడుగుపెట్టిన టీమిండియా స్టార్ బ్యాటర్, ముంబై ఇండియన్స్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం సృష్టించాడు. ఐపీఎల్ 2024లో తాను ఆడిన తొలి మ్యాచ్‌లో డకౌట్ అయిన సూర్య.. రెండో మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. గురువారం వాంఖడే వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 17 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు.…
నేడు ఐపీఎల్ 17వ సీజన్ లో భాగంగా బిగ్ ఫైట్ జరగనుంది. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా గెలిచిన ముంబై ఇండియన్స్ వారి సొంత మైదానమైన వాంఖడేలో స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలబడుతుంది. ఇరు జట్లలో దిగ్గజ ఆటగాళ్లు ఉండడం పై ఈ మ్యాచ్ పై భారీగా అంచనాలు ఉన్నాయి. ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్లకు మంచి బజ్ నెలకొని ఉండేది. ఇకపోతే నేడు రాత్రి 7:30 గంటల…
Suryakumar Yadav about Rehab in NCA ahead of IPL 2024: తాను జీవితంలో ఎప్పుడూ పుస్తకం చదవలేదని, పునరావాసం కారణంగా బుక్ చదవక తప్పలేదని ముంబై ఇండియన్స్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. గత మూడు నెలల్లో తాను 3 గాయాలతో పోరాడినట్లు చెప్పాడు. పునరావాసంలో మళ్లీ మళ్లీ అదే పనులు చేయడంతో చాలా బోరింగ్‌గా అనిపించిందని సూర్య చెప్పాడు. 2023 డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సూర్య గాయం బారిన పడ్డాడు. అప్పటినుంచి…
RCB Enters WPL 2024 Final after Beat MI in Eliminator: మహిళల ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024 ఫైనల్లోకి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) దూసుకెళ్లింది. శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో గెలిచిన ఆర్సీబీ.. తొలిసారి డబ్ల్యూపీఎల్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇక ఆదివారం జరిగే ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆర్సీబీ తలపడుతుంది. గతేడాది పేలవ ప్రదర్శన చేసిన ఆర్సీబీ.. ఈసారి మెరుగైన ప్రదర్శనతో ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఎలిమినేటర్…