Mumbai Indians bowler Jasprit Bumrah creates history in IPL against RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)పై 5 వికెట్ హాల్ సాధించిన తొలి బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం వాంఖడేలో ఐదు వికెట్స్ తీసిన అనంతరం ఈ రికార్డును తన పేరుపై లిఖించుకున్నాడు. బెంగళూరుపై తన నాలుగు ఓవర్ల కోటాలో 21 రన్స్ ఇచ్చి.. ఏకంగా 5 వికెట్స్ పడగొట్టాడు.
Also Read: MI vs RCB: నువ్ తోపు అన్న.. జస్ప్రీత్ బుమ్రాకు శిరస్సు వంచి సలాం కొట్టిన మహమ్మద్ సిరాజ్!
జస్ప్రీత్ బుమ్రా కంటే ముందు ఎవరూ కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఫైవ్ వికెట్ హాల్ సాధించలేదు. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆశిష్ నెహ్రా బెంగళూరుపై 4 వికెట్స్ పడగొట్టాడు. బుమ్రాకు ఇది ఐపీఎల్‌లో రెండో ఫైవ్ వికెట్ హాల్. జేమ్స్ ఫాల్క్‌నర్, జయదేవ్ ఉనద్కత్, భువనేశ్వర్ కుమార్‌లు ఐపీఎల్‌లో రెండుసార్లు ఐదు వికెట్ల ఘనత అందుకున్నారు. ఇక బెంగళూరుపై అత్యధిక వికెట్లు (29) తీసిన బౌలర్‌గా మరో రికార్డు కూడా నెలకొల్పాడు. రవీంద్ర జడేజా (26), సందీప్ శర్మ (26)ల రికార్డును బుమ్రా అధిగమించాడు.
5 wicket haul and prize wicket of Kohli.
Bumrah’s bowling figure so far in IPL 2024
Matches 5
Wickets 10 (most along with Chahal)
Average 11.90
Economy 5.95
Strike Rate 12Only bowler with less than 6 economy (min 4 wickets)
pic.twitter.com/IF7NrMrwQi— Cricketopia (@CricketopiaCom) April 11, 2024