MGM : వరంగల్ నగరంలోని ప్రముఖ ప్రభుత్వ వైద్యశాల అయిన ఎంజీఎం ఆసుపత్రిలో పెద్ద స్థాయిలో ఉద్యోగులపై చర్యలు ప్రారంభమయ్యాయి. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అనుమతుల్లేకుండా విధులకు హాజరు కాకపోవడం వంటి కారణాలతో మొత్తం 77 మంది సిబ్బందికి మెమోలు జారీ చేశారు. ఈ ఘటన ఆసుపత్రిలో నెలకొన్న పరిస్థితులకు అద్దం పడుతోందని అధికారులు పేర్కొన్నారు. శనివారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఎంజీఎం ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు. ఈ…
Sumanth Reddy: వరంగల్‌లో జరిగిన దారుణ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. డాక్టర్ సుమంత్ రెడ్డి తన ప్రాణాలను కోల్పోయిన విషాదకర ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గత నెల 20వ తేదీన బట్టుపల్లి సమీపంలో కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఆయనపై దాడి జరిగింది. ఈ దాడి వ్యవహారంలో ఆయన భార్య ఫ్లోరా ప్రధాన ముద్దాయి అని పోలీసుల విచారణలో వెల్లడైంది. దాడిలో తీవ్రంగా గాయపడిన సుమంత్ రెడ్డిని కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఒక…
ఎంజీఎంలో దారుణం చోటు చేసుకుంది. నాలుగు రోజుల పసి గుడ్డును కుక్కలు పిక్కోని తింటున్న దృశ్యం దర్శనమిచ్చింది. ఈ ఘటన ఎక్కడో ఆస్పత్రి ఆవరణలోని మూల ప్రాంతంలో కాదు.. అందరూ తిరుగుతుండే క్యాజువాలిటీ ముందు కనిపించింది. అయితే.. ఈ పసికందును కుక్కలు ఎక్కడి నుంచి తీసుకుని వచ్చాయనే వివరాలను ఆస్పత్రి అధికారులు, పోలీసులు సేకరిస్తున్నారు. పసికందు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.
నెలలు నిండకుండానే జన్మించిన పసికందులకు ఎంజీంలోని పీడియాట్రిక్ యూనిట్ ఐసీయూ/హెచ్‌డీయూ వార్డుల్లో ట్రీట్మెంట్ అందిస్తుంటారు. వీరి కోసం రెండు వార్డుల్లో కలిపి నాలుగు చొప్పున 8 ఏసీలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అవి పని చేయడం లేదు.. ఓ వైపు ఎండలతో ఉష్ణోగ్రత స్థాయి పెరిగి పసికందులు తల్లడిల్లిపోతున్నాయి.
పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఉద్యోగులను పట్టించుకోలేదని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించిన ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా.. ముందుగా ఎంజీఎం మహిళా సిబ్బంది అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మీరు అందరూ ప్రభుత్వం గెలుపుకు కారణం అయినందుకు మీరందరికి చెప్పినట్లుగానే ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా మీరు నర్సింగ్ ఉద్యోగాన్ని సద్వినియోగం చేసుకుని పేషంట్లకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని…
MGM Hospital: కోతుల చేష్టలు రోగులకు ఆవస్థలు తెచ్చిపెట్టాయి. శుక్రవారం అర్ధ రాత్రి సమయంలో హనుమకొండ ఎంజీఎం ఆసుపత్రిలోని అత్యవసర వైద్యవిభాగం వెనుకాల ఏఎంసీకి వెళ్లే దగ్గర కోతులు విద్యుత్తు స్తంభాల తీగలపై అటు ఇటు కదిలించాయి.
Warangal Corona: వరంగల్‌లో కరోనా మరియు ఓమిక్రాన్‌ను ఎదుర్కొంటున్నప్పుడు, కొత్త వేరియంట్ నేపథ్యంలో అధికారులు మరోసారి అప్రమత్తమయ్యారు. ఈ మేరకు వరంగల్ ఎంజీఎంలో ప్రత్యేక వైద్యుల బృందాన్ని కూడా నియమించారు.
వరంగల్ లోని ఎంజీఎం హస్పటల్ నిత్యం వార్తల్లో నిలుస్తునే ఉంటుంది. పెద్ద ప్రభుత్వాసుపత్రిగా పేరున్న ఈ ఎంజీఎం దవాఖానాలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియజేసే మరో ఘటన ప్రస్తుతం తెలంగాణలో వైరల్ అవుతోంది.
రోడ్డు ప్రమాదాలు ఏ రూపంలో వస్తాయో తెలీని పరిస్థితి ఏర్పడింది. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం మందారిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న అశోక్ లేలాండ్ ట్రాలీ వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ట్రాలీ లో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు . మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలిసింది. https://ntvtelugu.com/ed-attacher-6-crore-property-of-balwinder-singh-in-money-landaring-case/ శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన 25 మంది…
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుకలు కొరికిన ఘటన విషాదంగా మారింది. నిమ్స్‌లో చికిత్స పొందుతూ శ్రీనివాస్ మృతి చెందాడు. హన్మకొండ భీమారానికి చెందిన శ్రీనివాస్ గత కొంతకాలంగా ఊపిరితిత్తులు, మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నాడు. ఇటీవల ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, శ్రీనివాస్‌ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తుండగా.. ఆయన్ని ఎలుకలు కొరుక్కుతిన్నాయి. ఈ ఘటన సంచలనంగా మారడంతో.. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావుపై బదిలీ వేటువేసింది.…