వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుకలు కొరికిన ఘటనలో బాధితుడు శ్రీనివాస్ మృతిచెందాడు. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు తెలిపారు. నిన్న సాయంత్రం మెరుగైన వైద్యం కోసం శ్రీనివాస్‌ను వరంగల్ నుంచి హైదరాబాద్‌కు తరలించారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందించినట్లు వైద్యులు తెలిపారు. అయితే చికిత్సకు సహకరించక పోవడంతో శ్రీనివాస్ తీవ్ర అస్వస్థతతో మృతిచెందినట్లు వెల్లడించారు. దీంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. అసలే ఆర్థిక…
వరంగల్ ఎంజీఎం పరిసరాలను,ఆర్ఐసీయూ ను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,డీఎంఈ రమేష్ రెడ్డి. శ్రీనివాస్ కు చాలా సమస్యలు ఉన్నాయి. పరిస్థితి కూడా సీరియస్ గా ఉంది. హాస్పిటల్ ఘటనకు బాధ్యులపై రిపోర్ట్ మేరకు మంత్రి హరీష్ రావు యాక్షన్ తీసుకున్నారు. మంత్రి హరీష్ రావు పొద్దున్నే మాట్లాడారు విజిట్ చేయమని చెప్పారన్నారు మంత్రి ఎర్రబెల్లి. ఎలుకలు కొరుక్కుతినడం మా నిర్లక్షమే..మేము కాదనడం లేదన్నారు. ఎంజీఎంలో డ్రైనేజీ ఇబ్బంది ఉంది. అండర్…
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఐసీయూలో రోగిని ఎలుకలు కొరికిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు వైద్యులపై సస్పెన్షన్ వేటు వేసింది. అంతేకాకుండా ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావును కూడా బాధ్యుడిగా గుర్తించింది. ఆయనపై బదిలీ వేటు వేసింది. ఎంజీఎం సూపరింటెండెంట్‌గా శ్రీనివాసరావు స్థానంలో చంద్రశేఖర్‌కు పూర్తి బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా రోగిని ఎలుకలు కొరికిన ఘటనపై పూర్తి వివరాలు తక్షణమే నివేదిక పంపించాలని…
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఐసీయూలో భీమారంకు చెందిన రోగి శ్రీనివాస్ కాళ్లు, చేతులను ఎలుకలు కొరికాయి. దీంతో రోగికి తీవ్రంగా రక్తస్రావం జరిగింది. ప్రస్తుతం రోగి శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు సీరియస్ అయ్యారు. తక్షణమే విచారణకు ఆదేశించారు. అధికారులు సమర్పించే నివేదిక ఆధారంగా కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. మరోవైపు వరంగల్ అడిషనల్ కలెక్టర్…
ఒకవైపు కరోనా.. మరోవైపు ఒమిక్రాన్ తెలంగాణ వాసుల్ని భయపెడుతోంది. దీనికి తోడు కరోనా మూడో దశ ముంచుకువస్తుందన్న హెచ్చరిక నేపథ్యంలో వరంగల్ వైద్యవర్గాలు అప్రమత్తం అవుతున్నాయి. మూడో దశ తీవ్రత ఎలా ఉంటుందనే విషయంలో ఇంకా స్పష్టత రాకపోయినా ముందస్తు చర్యల పైన అధికారులు దృష్టి సారించారు. ఉత్తర తెలంగాణలో అయిదు ఉమ్మడి జిల్లాలకు ఏకైక పేదల పెద్ద ఆస్పత్రి అయిన వరంగల్ ఎంజీఎంలో మరో మారు 250 పడకల ప్రత్యేక వార్డు ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు.…
వరంగల్ పర్యటనలో భాగంగా ఇవాళ ఎంజీఎం ఆస్పత్రికి చేరుకున్న సిఎం కెసిఆర్ నేరుగా కోవిడ్ పేషంట్లు ఉన్న ఐసీయూ వార్డులోకి వెళ్లి రోగులను పరామర్శించారు. కోవిడ్ పేషంట్లకు అందుతున్న చికిత్స గురించి తెలుసుకున్నారు. కరోనాకు భయపడవద్దంటూ వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వరంగల్ మట్టెవాడకు చెందిన కరోనా పేషంట్ వెంకటాచారి తనకు వైద్య చికిత్స బాగానే అందుతున్నదని సీఎంకు వివరించారు. కేసీఆర్ జిందాబాద్.. కేసీఆరే నా నిండు ప్రాణం అని ఆయన అన్నారు. ప్రతీ బెడ్…