వీధి కుక్కల బెడదపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. వీధి కుక్కల సమస్యపై అఫిడవిట్ దాఖలు చేయని రాష్ట్రాలపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
హైదరాబాద్‌లో వీధికుక్కల దాడిలో ఓ బాలుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కుక్కల దాడిపై హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చేసిన వ్యాఖ్యలపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు.