Ram Gopal Varma: హైదరాబాద్‌లో వీధికుక్కల దాడిలో ఓ బాలుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కుక్కల దాడిపై హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చేసిన వ్యాఖ్యలపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్లు చేశారు. కుక్కకు కుడిచేత్తో తినిపిస్తూ, ఎడమచేత్తో తింటున్న వీడియోకు సంబంధించి ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.
కుక్కలంటే మేయర్‌కి ప్రేమ చాలా ఎక్కువ. కుక్కలన్నింటిని ఇంటికి తీసుకెళ్లి తినిపిస్తే అవి మన పిల్లలను తినవని ట్వీట్ చేశాడు. కుక్కలపై ఇంత ప్రేమ చూపిస్తున్న మేయర్.. నగరంలో ఉన్న కుక్కలను కూడా మేయర్ ఇంటికి తీసుకెళ్లి ఇంటి మధ్యలో మేయర్‌ని కూర్చోబెడితే బాగుంటుందని వ్యాఖ్యానించారు. చిన్నారులపై దాడి చేసిన వీధి కుక్కలను తీసుకెళ్లి మేయర్ ఇంట్లో వదలాలి అప్పుడు ప్రేమగా తినిపిస్తారో లేదో చూడాలి అంటూ ట్వీట్ ల వర్షం కురిపించారు ఆర్టీవీ. అయితే.. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ మేయర్‌పై చేసిన ట్వీట్ వైరల్‌గా మారుతున్న వేలా.. ఇవాళ ఇదే అంశంపై ఆర్జీవీ మరోసారి స్పందించారు. ఇప్పుడు ట్వీట్ కాకుండా ఏకంగా చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేసిన వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే కాదు మేయర్ ను పాట ద్వారా ప్రశ్నిస్తూ.. ఈ పాపం ఎవరిది అంటూ సాంగ్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోను ఇవాల సాయంత్రం రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సాంగ్ చూసిన నెటిజన్లు ఆర్టీవీని తెగ పొగడేస్తున్నారు. ప్రశ్నించడంలో ఆర్టీవీ మించిపోయారంటూ ప్రశంసిస్తున్నారు.
Full VIDEO song KUKKALA MAYOR releasing 6 pm TODAY ..BOW BOW ! pic.twitter.com/nCrOstmpNa
— Ram Gopal Varma (@RGVzoomin) March 11, 2023
Kacha Badam: మళ్లీ రోడ్డెక్కిన కచ్చా బాదామ్ సింగర్.. అయ్యో పాపం అంటున్న నెటిజన్..