మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మికంగా మృతి చెందడం పట్ల ఏపీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనకు తొలినాళ్ల నుంచి సుపరిచితుడైన యువ నేత గౌతమ్ రెడ్డి అని జగన్ అన్నారు. గౌతమ్ మృతి ఎంతో బాధను కలిగిస్తోందని చెప్పారు. యువ మంత్రివర్గ సహచరుడిని కోల్పోవడం చెప్పలేనంత ఆవేదనను కలిగించిందన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాసేపట్లో సీఎం జగన్ హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి రానున్నారు. స్వయంగా మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి జగన్…
ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి హఠాత్తుగా చనిపోవడం రాజకీయ వర్గాలను కలవరపరుస్తోంది. ఆయన ఇటీవల కరోనా బారిన పడి కోలుకున్నారు. ఈ పోస్ట్ కోవిడ్ పరిణామాలే హఠాన్మరణానికి కారణంగా వైద్యవర్గాలు భావిస్తున్నాయి. దుబాయ్ టూర్ ముగించుకుని ఆదివారమే హైదరాబాద్‌కు వచ్చిన మంత్రి గౌతమ్‌రెడ్డికి సోమవారం ఉదయం గుండెపోటు వచ్చింది. దీంతో ఇంట్లో ఉన్నవారు వెంటనే అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ మంత్రి మృతి చెందారని అపోలో ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. తండ్రి మేకపాటి రాజమోహన్…
కరోనా మహమ్మారి ప్రభావం అందరిపైన ఉంది. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కరోనా బారినపడి చికిత్స పొందుతున్నారు. కరోనా డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ వేరియంట్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తుండడంతో దేశవ్యాప్తంగా భారీగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్ డౌన్ లాంటివి విధించారు. ఏపీ లోనూ కరోనా రక్కసి విజృంభిస్తోంది. అధికార వైసీపీ కి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు…
కేంద్ర పోర్టులు, ఓడరేవులు, జలమార్గాలు మంత్రి సబరనాథ్ సోనోవల్ ని కలిశారు ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి. గతంలో ఈ శాఖలకు కేంద్ర మంత్రిగా మనుసుఖ్ మాండవీయ నిర్వహించిన నేపథ్యంలో, ప్రస్తుత మంత్రి సోనోవల్ కి ఏపీ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి ప్రణాళికను మరోసారి వివరించిన రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. రాష్ట్రంలోని 3 పోర్టులు, 11 ఫిషింగ్ హార్బర్ లకు అందించాల్సిన కేంద్ర నిధులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. రాష్ట్ర పునర్వ్యస్థీకరణ…
ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 21వ తేదీ నుంచి ట్రేడ్ కార్నివాల్ నిర్వహించేందుకు సిద్ధమైంది ప్రభుత్వం.. వాణిజ్య ఉత్సవం పోస్టర్, లోగో విడుదల చేసిన మంత్రులు మేకపాటి, కన్నబాబు.. ఈ సందర్భంగా పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ఆజాద్ కా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా దేశ వ్యాప్తంగా ట్రేడ్ కార్నివాల్ నిర్వహిస్తోందని.. రాష్ట్రంలో ఈ నెల 21 నుంచి ట్రేడ్ కార్నివాల్ నిర్వహిస్తామని.. ఈ నెల 21, 22 తేదీల్లో…
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల వ్యవహారం హాట్ టాపిక్‌గా నడుస్తూనే ఉంది.. ఏ క్షణంలోనైనా విశాఖకు రాజధాని తరలిపోవచ్చు అని చెబుతూ వస్తున్నారు మంత్రులు, అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు.. అయితే, ఇవాళ రాజధానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి.. తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో చిత్తూరు జిల్లా సమీక్ష కమిటీ సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామితో కలిసి పాల్గొన్న ఆయన.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని…
మంత్రి మేకపాటి అధ్యక్షతన పరిశ్రమల శాఖపై సమీక్ష నిర్వహించారు. ఏపీలో 2 మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు చేయనున్నారు. అయితే త్వరలో ప్రత్యేక లాజిస్టిక్ పాలసీ-2021 వస్తుంది అని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. అయితే లాజిస్టిక్ పాలసీ -2021 పై కసరత్తు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తరహాలో ఈజ్ ఆఫ్ లాజిస్టిక్స్… మౌలిక సదుపాయలకు పెద్దపీట వేస్తుంది ఏపీ. కేంద్రస్థాయిలో అథారిటీ ఏర్పాటులో భాగంగా ఇప్పటికే రాష్ట్రానికి…
రాష్ట్ర అభివృద్ధి, పోర్టుల ఏర్పాటుపై నిర్ణయాధికారం కేంద్రం చేతిలోకి వెళ్లటాన్ని అంగీకరించబోమని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఇండియన్ పోర్ట్స్ డ్రాఫ్ట్ బిల్లు 2020పై మాకు అభ్యంతరాలు ఉన్నాయన్నారు.. ఈ బిల్లు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసిన ఏపీ మంత్రి.. బిల్లును అధ్యయనం చేసి పూర్తిస్థాయిలో అభ్యంతరాలు చెప్పటానికి నెల రోజుల సమయాన్ని కేంద్రానికి అడిగినట్టు తెలిపారు.. పోర్టులు ఉమ్మడి జాబితాలో…
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రలోనే కాదు దేశ వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా వస్తున్న విషయం తెలిసిందే. అయితే కరోనా పేషేంట్లకు ట్రీట్మెంట్ అందించే సమయంలో ఆక్సిజన్ చాలా ముఖ్యం కావడంతో దాని కొరత ఏర్పడుతుంది. ఇక ఏపీలో ఆక్సిజన్ కొరతపై రేపు మంత్రి మేకపాటి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఇందులో ఆక్సిజన్ ఆధారిత పరిశ్రమలకు ప్రత్యామ్నాయం చూపే దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో…