హైదరాబాద్‌లో కన్నుమూసిన ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతికకాయాన్ని ఇవాళ నెల్లూరుకు తరలించనున్నారు.. ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లోని నివాసంలో గౌతమ్‌రెడ్డి భౌతికకాయం ఉండగా.. కుటుంబ సభ్యులు, నియోజకవర్గ, జిల్లా ప్రజల సందర్శనార్థం మేకపాటి భౌతిక కాయాన్ని నెల్లూరులోని డైకాస్ రోడ్డులో ఉన్న నివాసం వద్ద ఉంచనున్నారు. కడసారి పార్థివదేహాన్ని చూసేందుకు తరలిరానున్న అభిమానుల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలికాప్టర్‌లో హైదరాబాద్ నుండి నెల్లూరుకు గౌతమ్ రెడ్డి పార్థివదేహాన్ని తరలిస్తారు.. బేగంపేటఎయిర్…
ఆంధ్రప్రదేశ్ యువ కేబినెట్ మినిస్టర్ మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం అందరికీ షాక్‌గా మారింది.. ఫిట్‌గా ఉండే గౌతమ్‌రెడ్డి.. చిన్న వయస్సులోనే ప్రాణాలు కోల్పోవడాన్ని వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.. ఇదే, సమయంలో.. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతి కూడా మరోసారి తెరపైకి వచ్చింది.. ఇద్దరిదీ చిన్న వయస్సే. ఇద్దరూ గుండెపోటతోనే సడెన్‌గా తిరిగిరాని లోకాలకి వెళ్లిపోయారు.. ఇద్దరికీ అనేక పోలికలున్నాయి. పునీత్ రాజ్ కుమార్ వయస్సు 46 ఏళ్లు. గౌతమ్ రెడ్డి వయస్సు 50…
ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు ఎల్లుండి నిర్వహించనున్నారు.. అయితే, ముందుగా ప్రకటించినట్టుగా ఆయన స్వగ్రామం బ్రాహ్మణపల్లిలో కాకుండా.. మరోచోట అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు ఎల్లుండి నిర్వహించనున్నారు.. ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీ వద్ద గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు జరగబోతున్నాయి.. ప్రస్తుతం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలోనే గౌతమ్‌రెడ్డి భౌతిక కాయం ఉండగా.. రేపు ఉదయం నెల్లూరుకు తరలించనున్నారు..…
ఆంధ్రప్రదస్త్రశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం మొదలైంది.. నిజాలకంటే ముందుగా అబద్దాలు ప్రపంచాన్ని చుట్టేసే పనిలో పడిపోయాయి.. అయితే, సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వదంతులపై మంత్రి మేకపాటి కుటుంబం స్పందించింది.. ఆయన వ్యాయామం చేస్తూ ఇబ్బందిపడ్డారన్న వార్తలు అవాస్తవం అని స్పష్టం చేసింది.. రాత్రి ఆయన ఇంటికి చేరుకున్నపట్టి నుంచి ఆయన ఉదయం ఇబ్బంది పడడం.. ఆస్పత్రికి తరలించడం.. ఆయన మృతిచెందినట్టు వైద్యులు ప్రకటించేవరకు జరిగిన అన్ని విషయాలను…
ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతికకాయాన్ని రేపు ఆర్మీ హెలికాప్టర్‌లో నెల్లూరుకు తరలించనున్నారు.. ఇవాళ ఉదయం గుండెపోటుతో ఆయన హఠాన్మరణం చెందారు. గుండెపోటుకు గురైన ఆయన హుటాహుటిన జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు.. అయితే, ఆయన్ను ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.. గౌతమ్‌రెడ్డి ఇంటి వద్దే కుప్పకూలారని వైద్యులు ప్రకటించారు. ఉదయం 7.45 గంటలకు గౌతమ్‌రెడ్డిని ఆస్పత్రికి తీసుకువచ్చారని.. ఆస్పత్రికి వచ్చేసరికే స్పందించని స్థితిలో ఉన్నారని తెలిపారు.. అయితే, రేపు ఉదయం ఆర్మీ…
ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠన్మారణంతో ఏపీ విషాదంలో మునిగిపోయింది.. ఇక, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ శ్రేణులు దిగ్భ్రాంతికి లోనవుతున్నాయి… సీఎం వైఎస్ జగన్ సహా.. మంత్రులు, నేతలు.. హైదరాబాద్‌కు వచ్చి ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు.. మేకపాటి భౌతికకాయానికి నివాళులర్పించిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. సొంత అన్నను కోల్పోయినట్లు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.. ఎక్కడ కూడా వివాదాలు లేని వ్యక్తి మేకపాటి గౌతమ్‌రెడ్డి అని పేర్కొన్న ఆయన.. ఎప్పుడూ నవ్వే వ్యక్తి ఆయన అని గుర్తుచేసుకున్నారు..…
ఏపీ పరిశ్రమల శాఖ, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సోమవారం ఉదయం హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో గుండెపోటుతో మరణించారు. అనంతరం ఆయన భౌతిక కాయాన్ని జూబ్లీహిల్స్‌లోని స్వగృహానికి తరలించారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు మేకపాటి గౌతమ్‌రెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడ మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణించడం చాలా బాధాకరమని చంద్రబాబు అన్నారు. ఆయన వివాదాల జోలికి వెళ్లకుండా పనులు…
అమరావతి: మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం నేపథ్యంలో రెండు రోజుల పాటు రాష్ట్రంలో సంతాప దినాలను పాటించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అటు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. బుధవారం నాడు మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం. అటు మంత్రి గౌతమ్ రెడ్డి మృతికి సంబంధించిన వివరాలను హైదరాబాద్ అపోలో ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. సోమవారం ఉదయం గౌతమ్ రెడ్డి తన ఇంట్లో ఒక్కసారిగా…
ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మృతితో వైసీపీలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని కాసేపట్లో హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి తరలించనున్నారు. సోమవారం రాత్రి వరకు అక్కడే ఉంచి అనంతరం స్వగ్రామమైన నెల్లూరు జిల్లాలోని బ్రాహ్మణపల్లికి తరలించనున్నారు. బుధవారం నాడు మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గౌతమ్‌రెడ్డి కుమారుడు అమెరికాలో చదువుతుండటంతో అతడు వచ్చాకే అంత్యక్రియలు జరపాలని కుటుంబీకులు నిర్ణయించినట్లు సమాచారం. కాగా మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం రాజకీయ నేతలతో…