PM Modi: జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా కాశ్మీర్ లోయలో ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు పర్యటించారు. ప్రధాని ‘విక్షిత్ భారత్ విక్షిత్ జమ్మూకాశ్మీ్ర్’ కార్యక్రమానికి హాజరయ్యేందుకు శ్రీనగర్‌లోని బక్షి స్టేడియంకి భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు. అయితే, ఈ సభకు ప్రజల్ని బలవంతంగా తరలించారని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు మహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా ఆరోపించారు.
Mehbooba Mufti: జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ పార్టీ అధినేత మహబూబా ముఫ్తీ తృటిలో భారీ ప్రమాదం నుంచి బయటపడ్డారు. గురువారం మధ్యాహ్నం ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన అనంత్‌నాగ్ జిల్లాలోని సంగమ్ వద్ద జరిగింది. ఎదురుగా వస్తు్న్న కారును, ముఫ్తీ ప్రయాణిస్తున్న స్కార్పియో ఢీకొట్టింది.
Mehbooba Mufti: జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి) నాయకురాలు మెహబూబా ముఫ్తీ సంచలన ఆరోపణలు చేశారు. శనివారం రోజున 50 ఆర్‌ఆర్‌కు చెందిన ఆర్మీ దళాలు పుల్వామాలోని మసీదులోకి ప్రవేశించి, అక్కడి ముస్లింలను ‘జై శ్రీరాం’ అని నినాదాలు చేయమని బలవంతం చేశారని ఆరోపించారు. రెచ్చగొట్టే విధంగా సైన్యం ప్రవర్తించిందని దీనిపై విచారణ ప్రారంభించాలని లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘైనీని ఆమె కోరారు.
Mehbooba Mufti: జీ 20 దేశానికి సంబంధించిన కార్యక్రమం అని.. కానీ బీజేపీ దాన్ని హైజాక్ చేసిందని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ బెంగళూర్ లో ఆరోపించారు. జీ 20ని వ్యతిరేకించడం లేదని, కానీ బీజేపీ హైజాక్ చేసిందని అన్నారు. చివరకు జీ 20 లోగోను కూడా కమలంగా మార్చిందని ఆమె విమర్శించారు. లోగో దేశానికి చెందినదిగా ఉండాలని, పార్టీకి సంబంధించిన విధంగా ఉండకూడదని ఆమె అన్నారు.
Mehbooba Mufti backs Israeli filmmaker's remarks on The Kashmir Files: దేశంలో ‘ కాశ్మీర్ ఫైల్స్’ సినిమా మరోసారి వివాదాలకు కేంద్ర బిందువు అయింది. గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమం ఈ వివాదానికి వేదిక అయింది. ఈ కార్యక్రమంలో జ్యూరీ హెడ్ ఇజ్రాయిలీ చిత్ర నిర్మాత నాదవ్ లాపిడ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. కాశ్మీర్ ఫైల్స్ సినిమాను ‘ వల్గర్’ సినిమా అని విమర్శించడంతో ఒక్కసారిగా…
Islamic body seeks ban on bhajans across schools in jammu kashmir: కాశ్మీర్ పాఠశాలల్లో శనివారం చేస్తున్న భజనలు, సూర్య నమస్కారాలు నిలిపివేయాలని ముత్తాహిదా మజ్లిస్- ఎ- ఉలేమా(ఎంఎంయూ) ప్రభుత్వం, విద్యాశాఖను కోరింది. ముస్లింల మతపరమైన భావాలు దెబ్బతింటున్న కారణంగా వీటన్నింటిని నిలపివేయాలని కోరింది. జామియా మసీద్ మతగురువు, హురియత్ ఛైర్మన్ మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ నేతృత్వంలోని ఈ సంస్థ యోగా, ఉదయం ప్రార్థనల పేరుతో చట్టాలు తీసుకురావడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.ముస్లిం విద్యార్థులు…
Mehbooba Mufti comments on Gyanvapi case: జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పుపై జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ తీవ్రంగా స్పందించారు. ఇది స్పష్టంగా ప్రార్థన స్థలాల చట్టాలను ఉల్లఘించడమే అని అన్నారు. ఉద్యోగాలు కల్పించడంలో, ద్రవ్యోల్భాన్ని నియంత్రించడంలో బీజేపీ ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. మనం మసీదులు పడగొట్టడంలో ‘‘విశ్వగురువు’’ అవుతామని బీజేపీని ఎద్దేవా చేశారు.
Supreme Court key judgment on Anti-Money Laundering Cases: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు మద్దతు ఇస్తూ సుప్రీం కోర్టు కీలక తీర్పును బుధవారం వెలువరించింది. ఈడీ అరెస్ట్ చేసే అధికారంలో పాటు ఈడీకి వ్యతిరేకంగా లేవనెత్తిన అన్ని అభ్యంతరాలను సుప్రీంకోర్టు తిరస్కరించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం( పీఎంఎల్ఏ)లోని నేర పరిశోధన, అరెస్ట్ అధికారం, ఆస్తుల అటాచ్మెంట్ మొదలైన నిబంధనలను సుప్రీంకోర్టు సమర్థించింది. మనీలాండరింగ్ అరెస్టులు ‘‘ఏకపక్షం’’ కానది సంచలన ఉత్తర్వుల ఇచ్చింది.