Mehbooba Mufti: జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి) నాయకురాలు మెహబూబా ముఫ్తీ సంచలన ఆరోపణలు చేశారు. శనివారం రోజున 50 ఆర్‌ఆర్‌కు చెందిన ఆర్మీ దళాలు పుల్వామాలోని మసీదులోకి ప్రవేశించి, అక్కడి ముస్లింలను ‘జై శ్రీరాం’ అని నినాదాలు చేయమని బలవంతం చేశారని ఆరోపించారు. రెచ్చగొట్టే విధంగా సైన్యం ప్రవర్తించిందని దీనిపై విచారణ ప్రారంభించాలని లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘైనీని ఆమె కోరారు.
Read Also: KTR: తర్వలో జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు.. ఈ ప్రక్రియ అల్లం నారాయణకు అప్పగించామన్న కేటీఆర్
జూన్ 14న పాకిస్తాన్ నియంత్రణ రేఖ, కాశ్మీర్ లో ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. వ్యూహాత్మకైన శ్రీనగర్ లోని చినార్ కార్ఫ్స్ ఆఫ్ ఆర్మీకి నాయకత్వం వహిస్తున్నారు. ముఫ్తీ ట్వీట్ చేస్తూ.. ‘‘50 ఆర్‌ఆర్‌కి చెందిన ఆర్మీ దళాలు పుల్వామాలోని మసీదులోకి చొరబడి లోపల ఉన్న ముస్లింలను ‘జై శ్రీరాం’ అని నినాదాలు చేయడాన్ని గురించి విని షాక్ అయ్యాను. అమిత్ షా కాశ్మీర్ లో ఉన్నప్పుడు, అది కూడా యాత్రకు ముందు అలాంటి చర్యలు రెచ్చగొట్టడమే అవుతుంది. దీనిపై విచారణ చేయాలి’’ రాజీవ్ ఘయ్ ని అభ్యర్థించారు.
అంతకుముందు ఏప్రిల్ నెలలో శ్రీనగర్ లో జరిగిన జీ-20 సమావేశానికి ముందు స్థానిక వ్యక్తుల్ని భద్రతా బలగాలు అరెస్ట్ చేసి హింసిస్తున్నాయంటూ ఆమె ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్‌లో పరిస్థితి గ్వాంటనామో బే కంటే అధ్వాన్నంగా ఉందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్ లో జీ -20 ఈవెంట్ నిర్వహించడానికి సన్నాహాలు ప్రారంభించినప్పటి నుండి, వందలాది మంది స్థానిక పురుషులను అదుపులోకి తీసుకున్నారని అన్నారు.
Shocked to hear about army troops from 50 RR storming into a mosque at Pulwama & forcing muslims inside to chant ‘Jai Shree Ram’. Such a move when @AmitShah is here & that too ahead of yatra is simply an act of provocation. Request @RgGhai to immediately set up a probe.
— Mehbooba Mufti (@MehboobaMufti) June 24, 2023